మహబూబ్‌నగర్

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్దం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 26: జిల్లాలో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్దమయ్యింది. పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయం ఉండడంతో అధికార యంత్రాంగం పోలింగ్ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శనివారం పోలింగ్‌కు సంబంధించిన సామాగ్రిని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్ నుండి తరలించారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాంకిషన్ పర్యవేక్షణలో పోలింగ్‌కు సంబంధించిన సామాగ్రి, బాక్సులు, బ్యాలెట్ పత్రాలను తరలించారు. జిల్లాలో ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1262 మంది ఓటర్లు ఉండగా, డివిజన్ల వారిగా ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడికి పోలింగ్‌కు సంబంధించిన సామాగ్రిని తరలించారు. పోలీసు బందోబస్తు మధ్య ఈ ప్రక్రియ కొనసాగింది. మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలో 392 ఓట్లు ఉండగా, నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలో 206, వనపర్తి డివిజన్ పరిధిలో 167, గద్వాల డివిజన్ పరిధిలో 212, వనపర్తి డివిజన్ పరిధిలో 285 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎంపిలు, ఎమ్మెల్యేలు, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. అయితే జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలకు గాను ఇందులో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రిజనార్థన్‌రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌లు ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. మిగితా ఆరగురు ఎమ్మెల్యేల పరిధిలోని మున్సిపాలిటీలు లేని కారణంగా ఓటుహక్కు లేదు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ ఇప్పటికే ఆయా డివిజన్ల డిఎస్పిలకు ఆదేశాలు జారీ చేసి పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించడం, దాంతో ఇప్పటికే పోలీసు బలగాలు పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించి పోలింగ్ కేంద్రాలను తమ ఆధినంలోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్ ఎంపిడిఓ కార్యాలయం, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట ఎంపిడిఓ కార్యాలయ సమావేశ మందిరాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు.