మహబూబ్‌నగర్

మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిడ్జిల్, సెప్టెంబర్ 19: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మిడ్జిల్ మండల కేంద్రంలో ఈదమ్మ దేవాలయ ఆవరణలో నిర్వహించిన బతుకమ్మల చీరవల పంపిణికి మంత్రి ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ అంతకుముందు గ్రామంలో పురవీదుల గుండా తిరుగుతూ డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉపాధిలేక ఆకలితో సతమతమవుతున్న చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు రాష్ట్రంలో ప్రతి మహిళ పండుగకు కొత్త బట్టలు కట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్దన్నల మహిళలకు చీరల పంపిణీ చేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరు ఆత్మగౌరంతో బతకాలని ప్రభుత్వం తరపున అన్ని మతాల వారికి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కులమతాలకు అతీయితంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపడుచుకు బతుకమ్మ చీరను పంపిణీ చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మూడున్నరేళ్లలో చేసి చూపించామని అన్నారు. మిడ్జిల్ మండల కేంద్రానికి రూ.1.30 కోట్లతో గ్రామంలో సిసి రోడ్లుకు మంజూరి చేశామని అన్నారు. ఈ మండలానికి 9400 చీరలను మంజూరి చేయడం జరిగిందన్నారు. అన్ని గ్రామాలలో చీరల పంపిణీ జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి దీపా, జడ్పిటిసి హైమావతి, గ్రామ సర్పంచ్ జ్యోతి, వైస్ ఎంపిపి సుదర్శన్, ఉప ఉర్పంచ్ తిరుపతి, ఎంపిటిసి సరోజనమ్మ, తహశీల్దార్ పాండునాయక్, ఎంపిడిఓ కుమారస్వామి గ్రామాల సర్పంచులు, ఎంపిటిసీలు పాల్గొన్నారు.
భూరికార్డుల ఆకస్మిక తనిఖీ
* సమస్యలు తెలుసుకున్న స్మితాసబర్వాల్
కొత్తకోట, సెప్టెంబర్ 19: భూప్రక్షాళన జరుగుతున్న తీరును ముఖ్యమంత్రి సహయ కార్యదర్శి స్మితా సబర్వాల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం ముసాపేట మండలంలోని జానంపేట గ్రామంలో నిర్వహిస్తున్న భూప్రక్షాళన గ్రామసభలో ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. రెవిన్యూ రికార్డులను పరిశీలించి రైతుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 10 రోజుల పాటు ఒక గ్రామంలో భూప్రక్షాళన నిర్వహిస్తున్నామని అధికారులకు రైతులు సహకరించి తమ భూరికార్డులను సరి చేసుకోవాలని ఆమె వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూప్రక్షాళన మహా ఉద్యమంలా చేపడుతున్నామని రైతులు తమ రికార్డులను సరి చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి అవంతరాలు ఉండవని ఆమె వివరించారు.