మహబూబ్‌నగర్

నీచమైన ప్రతిపక్షం దురదృష్టకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 19: ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం పట్ల ప్రజలు సంతోషిస్తున్నారని కాంగ్రెస్ లాంటి నీచమైన పార్టీ మరికొన్ని పార్టీలు ప్రతి పక్షంలో ఉండటం తెలంగాణ ప్రజలు దురదృష్టకరంగా భావిస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఆరోపించారు. పేదల సంక్షేమం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పని చేస్తూ వారి కళ్లల్లో ఆనందం, నోటిపై చిరునవ్వు చూసేందుకే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా ఉర్కొండ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి మంత్రి లక్ష్మారెడ్డి ముఖ్య అథితిగా హాజరయ్యారు. అదేవిధంగా మండలంలో 48 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాల ద్వారా మంజూరైన చెక్కులతో పాటు మహిళ సంఘాల సభ్యులకు రూ.1.22 కోట్ల చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను అర్థికంగా పరిపుష్టి సాధించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కెసిఅర్ ఎన్నో బృహత్తర పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. రూ.222కోట్లతో రాష్ట్రంలోని ప్రతి అడపడుచు దసరా పండగ సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు బతుకమ్మ చీర అందుతుందన్నారు. రాజకీయ ఉనికి కోసమే బతుకమ్మ చీరల పంపిణీపై కాంగ్రెస్, టిడిపి, బిజెపి పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని అసలు వారి ఉద్దేశ్యం మరోలా ఉందన్నారు.
ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించిన ప్రతి పక్షాలు ప్రభుత్వం ఏ మంచి పని చేసిన తప్పుగానే చూపించాలని భావిస్తున్నాయని ఆయన ఆరోపించారు. బతుకమ్మ పండుగకు ప్రభుత్వం పెడుతున్న సారే సాంప్రదాయానికి చిహ్నామని అన్నారు. ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కడుతారని, ప్రజలు రాష్ట్రంలోని పరిస్థితులను గమనిస్తున్నారన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు, ఉర్కొండపేట సర్పంచ్ రాములు, మహిళలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ దృక్పథంతోనే విమర్శలు
చీరల పంపిణీపై రాద్ధాంతం తగదు * మహిళలే ప్రతిపక్షాలకు బుద్ధి చెబుతారు * మంత్రి జూపల్లి
నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 19: రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలకు విమర్శించేందుకు ఏమిలేకనే బతుకమ్మ చీరలపై రాజకీయ దృక్పథంతో వారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. మంగళవారం సాయంత్రం స్థానిక పిఆర్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ స్ఫూర్తితో రాష్ట్రంలోని మహిళలందరికి బతుకమ్మ కానుకగా ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తుంటే కాంగ్రెస్, బిజెపి, టిడిపి పార్టీలకు చెందిన నేతలు విమర్శలు చేస్తున్నారని, బతుకమ్మ చీరలపై రాద్ధాంతం చేస్తూ మహిళలను అవమానిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని మహిళలందరికి చేనేత వస్త్రాలను ఇచ్చి, చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కాని పూర్తిస్థాయిలో చీరలను సకాలంలో ఉత్పత్తి చేయకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి చీరలను కొనుగోళ్లు చేయాల్సి వచ్చిందన్నారు. బ్రిటిష్ ప్రధాని టోనిబ్లేయర్ నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని వట్టెం గ్రామానికి వస్తే ప్రభుత్వం కొంతమంది మహిళలకు చీరలు ఇచ్చి వట్టేంకు తీసుకొనివచ్చారని, ఆయన వెళ్లిన వెంటనే ఇచ్చిన చీరలు తీసుకున్న ప్రభుత్వంలో ఉన్న నేతలు నేడు చీరలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నల్లవెల్లి సర్పంచ్ పావని సోమవారం ఉదయం నల్లవెల్లి గ్రామంలో లబ్ధిదారులకు చీరలు పంపిణీ చేసి, సాయంత్రం నాగర్‌కర్నూల్‌కు వచ్చి నాసిరకం చీరలంటూ విమర్శలు చేసిందని ఉదయం మంచిగా ఉన్న చీరలు సాయంత్రం కాగానే నాసికరమైనావా అంటూ ప్రశ్నించారు. రాష్టవ్య్రాప్తంగా వేలాది గ్రామాలలో చీరల పంపిణీ జరుగుతుండగా, కొన్నిచోట్ల ప్రతిపక్ష పార్టీలు సృష్టించిన గ్రామాలలో నిరసనలు జరుగుతున్నాయే తప్ప, మహిళలలో ఎలాంటి అసంతృప్తిలేదని, సంతోషంగా చీరలు తీసుకుంటున్నారని తెలిపారు. విలేఖరుల సమావేశంలో ఆయన రాజకీయ కార్యదర్శి రాజశేఖర్‌రావు, జడ్పీటిసి వెంకటయ్య, ఎంపిపి వెంకటేశ్వరరావు, సర్పంచ్ ప్రతాప్‌గౌడ్ తదితరులు ఉన్నారు.