మహబూబ్‌నగర్

కాల్వ పనులను అడ్డుకున్న రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్వాడ, సెప్టెంబర్ 21: మరికల్ మండల పరిధిలోని తీలేర్-మరికల్ గ్రామాలకు వేళ్లే కోయిల్‌సాగర్ 16వ కాల్వ పనులను తీలేర్ గ్రామరైతులు అడ్డుకోవడం జరిగింది. కోయిల్‌సాగర్ కాల్వ పనులు భూములకు సంబంధించిన రైతులకు ఎలాంటి సమచారంను ఇవ్వకుండా కాల్వ పనులు చేపట్టడం ఎంతవరకు సమంజసమని రైతులు అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత వారం రోజులుగా కోయిల్‌సాగర్ కాల్వ పనులను అడ్డుకోవాడంతో గురువారం నారాయణపేట సబ్ కలెక్టర్ కృష్ణాదీత్యా,మరికల్ మండల తహశీల్దార్ చంద్రశేఖర్‌ల ఆధ్వర్యంలో పరిశీలించారు. అనంతరం కాల్వలలో భూములు కోల్పోయిన రైతులతో నారాయణపేట సబ్ కలెక్టర్ కృష్ణాదిత్య చర్చించారు.
వచ్చే యాసంగి నాటికి ప్రతి ఎకరాకు సాగునీరు
* ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి
పెద్దమందడి, సెప్టెంబర్ 21: వచ్చే యాసంగి నాటికి పెద్దమందడి మండలంలోని ప్రతి ఎకరాకు బుద్దారం కుడి కాల్వ ద్వారా సాగునీరు అందించి రైతులకు అందిస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం పెద్దమందడి మండల పరిదిలోని పామిరెడ్డిపల్లి ముందరితండా, చికటిచెట్టుతండా, జగత్‌పల్లి గ్రామాల్లో టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామిలో ముఖ్యమంత్రి కెసిఆర్ 500 జనాభా కలిగిన గిరిజన తండాలను గ్రామ పంచాయతిలుగా ఏర్పాటు చేసేందుకు అంగీకరించారని ముందరితండా, చీకటితండాలు గ్రామ పంచాయతిలుగా ఏర్పాటు కాబోతున్నాయని స్వయం పరిపాలనతో తండాలలో మరింతగా అభివృద్ధి చేసేందుకు వీలు ఏర్పడుతుందన్నారు. గ్రామాల అభివృద్ధి కొరుకునే వారందరూ ఆంధ్ర పార్టీని వదిలి టిఆర్‌ఎస్ పార్టీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం గిరిజన విద్యార్థుల కోసం 520 రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక్కొక్క విద్యార్థిపై రూ.లక్ష50వేలు ప్రభుత్వం భరిస్తుందని ఆయన అన్నారు. అనంతరం దొడగుంటపల్లిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు రూ.8లక్షలు కేటాయిస్తూ భూమిపూజ చేసి దొడగుంటపల్లి, చిన్నమందడిలలో చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దయాకర్, మాజీ జడ్పిటిసి జగదీశ్వర్‌రెడ్డి, నాయకులు రాజా ప్రకాష్‌రెడ్డి, నాగేందర్‌రావు, లక్ష్మణ్‌గౌడ్, జడ్పిటిసి రమేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.