మహబూబ్‌నగర్

రాజుకుంటున్న రైతు సమితిల రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 21: ఇటివల ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితిలను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది. టి ఆర్ ఎస్ నేతలు మాత్రం రైతుల సంక్షేమం కోసమే ఈ కమిటీలను వేసినట్లు చెప్పుకోస్తున్నారు. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వం వేసిన రైతు సమన్వయ సమితిలపై రగడ రాజుకుంది. ఇప్పటికే గ్రామ, మండల స్థాయిలో రైతు సమన్వయ సమితిలను పూర్తి చేసుకుని జిల్లా సమన్వయ సమితిని కూడా రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో కొన్ని అనివార్య కారణాలవల్ల జిల్లా కమిటి ప్రకటించడంలో ఆలస్యం అయ్యిందని తెరాస శ్రేణులు చెప్పుకోస్తున్నారు. ప్రభుత్వం సమన్వయ సమితిలను పూర్తిచేసి ఏకంగా ఈ నెల 15వ తేది నుండి భూరికార్డుల ప్రక్షాళనకు కూడా శ్రీకారం చుట్టింది. గ్రామస్థాయిలో ప్రభుత్వం వేసిన రైతు సమన్వయ సమితిల్లో తెరాస నేతల మధ్య నెలకొన్న విభేదాలను ఆసరాగా తీసుకుని వారిని తమవైపు మళ్లించుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ఎత్తులు వేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ రైతు సంరక్షణ కమిటీల పేరిట మరో కమిటిలకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టబోతుంది. ఇందుకుగాను ఇందిరమ్మ రైతుబాట పేరిట కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపర్చేందుకు రంగంలోకి పిసిసి నేతలు దిగారు. దీంతో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయం రాజుకుంది. ఓ పక్క రైతు సమన్వయ సమితిలు మరోపక్క కాంగ్రెస్ ఏర్పాటు చేయబోయే రైతు సమన్వయ సమితిలతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం నెలకొంది. ఇందులో భాగంగా ప్రభుత్వం తీసుకువచ్చిన 39జిఓను వ్యతిరేకిస్తూ నియోజకవర్గ మండల కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో వేలాది మందితో మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆద్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కారు. అచ్చంపేటలో 39జిఓకు వ్యతిరేకంగా భారి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి పిసిసి ఉపాధ్యక్షురాలు డికె అరుణతో పాటు కాంగ్రెస్ నేతలు హాజరై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దూకుడు పెంచాలని తెరాస ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను కూడా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అయితే ప్రభుత్వం వేసిన కమిటీలలో రెవెన్యూ గ్రామాన్ని ఆసరాగా చేసుకుని 14మంది సభ్యులతో కమిటీ వేయగా కాంగ్రెస్ మాత్రం 15మందిని నియమిస్తూ సమాంతర రాజకీయానికి తెర లేపింది. ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన సమితిలకు ఎలాంటి అధికారాలు లేవని అదేవిధంగా తమ పార్టీ నియమించిన వారికి కూడా ఎలాంటి అధికారాలు లేవని టిఆర్‌ఎస్ నాయకులు తమ పార్టీ కార్యకర్తలను ఏ విధంగా నియమించారో తాము మాత్రం అందుకు భిన్నంగా రైతులను నియమించబోతున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పుకొస్తున్నారు. అయితే తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ రైతాంగాన్ని పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల కోసం సమన్వయ సమితిలను ఏర్పాటు చేస్తే జీర్ణించుకోలేకనే సమాంతర కమిటీలకు కాంగ్రెస్ పునుకుందని మంత్రి లక్ష్మారెడ్డి ఆంధ్రభూమి ప్రతినిధితో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏది ఎమైనప్పటికిని పాలమూరు జిల్లాలో మాత్రం రైతు కమిటిలతో రాజకీయ రగడ రాజుకుని తెరాస, కాంగ్రెస్ నాయకుల మధ్య వార్ ప్రారంభం అయ్యింది.

శైలపుత్రి అలంకరణలో దర్శనమిచ్చిన జోగుళాంబదేవి
అలంపూర్, సెప్టెంబర్ 21: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ జోగుళాంబదేవి అమ్మవారు మొదటి రోజు గురువారం శైలి పుత్రిదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చి పూజలందుకున్నారు. తొలి రోజు గణపతి పూజ, పుణ్యహవాచనం, రుత్విక్‌వరణం, మహకళశస్థాపన, అంకురారోహణ, ధ్వజరోహణం పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ శ్రీ జోగుళాంబ సమేత బాలబ్రహేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంకాలం 6 గంటలకు ధ్వజరోహణ కార్యక్రమన్ని నిర్వహించారు. సాయంకాలం కొలువుపూజలో అమ్మవారి దర్బార్ సేవాలో కొలువు నిర్వహించి కుమారి, సువాసిని పూజలు, మహమంగళ హారతి, మంత్రపుష్పము ప్రసాదవితరణ కార్యక్రమలను నిర్వహించారు. కొలువు పూజలో అర్చక స్వాములు విక్రాంత్, శ్యాంకుమార్ శరన్నవరాత్రులలో తొలి రోజు శైలపుత్రిదేవిగా ఆరాధిస్తారని తెలిపారు. శైలిపుత్రి దేవి పర్వత రాజు పుత్రీక. ఈ దేవిని పార్వతి దేవిగా కొలుస్తారు. ఉత్సవాలలో భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇవో గురురాజ తగుచర్యలు చేపడుతున్నారు,
స్వామివారికి బంగారు కిరీటం వితరణ
మల్దకల్, సెప్టెంబర్ 21: మండల కేంద్రంలో ఆదిశిలా క్షేత్రంలో వెలసిన శ్రీ స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వరస్వామికి 5 తులాల 3 గ్రాముల బంగారు కిరీటాన్ని గురువారం ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావుకు వితరణ ఇచ్చారు. మన్నాపురం గ్రామానికి చెందిన సరోజమ్మ, నర్సింగ్‌రావుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు శ్యాంరావు, సుజాత, ప్రేమ్‌కిషన్‌రావు, కళ్యాణిలు కిరీటాన్ని ఆలయానికి బహూకరించారు.