మహబూబ్‌నగర్

చంద్రఘంటాదేవిగా జోగుళాంబ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలంపూర్, సెప్టెంబర్ 23: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ జోగుళాంబదేవి అమ్మవారు 3వ రోజు శనివారం చంద్రఘంటాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చి పూజలందుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తి పీఠమైన శ్రీ జోగుళాంబ దేవి, నవబ్రహ్మ ఆలయాల దివ్యధామాం అలంపూర క్షేత్రాన్ని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి తరలివస్తుండడంతో ఆలయాలు భక్తుల రద్దీతో కిక్కిరిశాయి. అమ్మవారి ఆలయంలో ఉదయం గణపతి పూజ, సహస్రనామర్చనలు, కుంకుమార్చనలు, నవావరణ అర్చనలు, చండి హోమం పూజ కార్యక్రమాలను నిర్వహించారు.
సాయంకాలం కొలువుపూజలో భాగంగా అమ్మవారి దర్బార్ సేవలో కొలువు నిర్వహించి కుమారి, సువాసిని పూజలు, మహమంగళ హారతి, మంత్రపుష్పము ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. కొలువు పూజలో అర్చక స్వాములు విక్రాంత్, శ్యాంకుమార్‌శర్మలు చంద్రఘంటా దేవి అమ్మవారిని శరన్నవ రాత్రులలో మూడవ రోజు అరాదిస్తారు. మాత శిరస్సుపై అర్థచంద్రుడు ఉండటం వల్ల చంద్రఘంటాదేవిగా పేరుగాంచారు. మహిషాసుర సంహరం కోసం అమ్మవారు ఘంటను ఒక ఆయుధంగా ఉపయోగిస్తారు. ఈ అమ్మవారిని పూజించిన వారికి మంగళం సిద్ధిస్త్తుంది. నిర్భయులుగా, సౌమ్యులుగా మారుతారని భక్తులకు తేలియజేశారు. ఆలయాలను విద్యుదీపాలంకరణలో, పూలమాలలతో అందంగా అలంకరించారు. ఉత్సవలలో భక్తులు ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యలు కలగకుండా కార్యనిర్వహణధికారి నరహరి గురురాజ తగుచర్యలు చేపడుతున్నారు.
అయిజలో...
అయిజ: అయిజ పట్టణంలోని శ్రీ కన్యకాపరమేశ్వరదేవి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం మూడవ రోజు అమ్మవారు లలితాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించాలి
*ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 23: పట్టణంలో ఈ నెల 26న మినీ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయనున్న బతుకమ్మ పండుగను అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ఇంటిలో శుభకార్యం జరిగితే ఏ విధంగా జరుపుకుంటామో ఆ విధంగా మన పట్టణంలో నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగను నిర్వహించుకోవాలని అన్నారు. ట్యాంక్‌బండ్ మొత్తం విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించాలని, ఎల్‌ఈడి పెద్ద లైట్లను ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులు ఈ నెల 25వ తేది నాటికి పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి అలంకరణ విభాగానికి అప్పగించాలని అన్నారు. 26వ తేదీ సాయంత్రం 4గంటల నుండే ట్యాంక్‌బండ్ పూర్తిగా జనసంద్రంగా మారేవిధంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి అధిక సంఖ్యలో ప్రజలు, మహిళలు, పిల్లలు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. మొదటిసారి నిర్వహిస్తున్నందున ఘనంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ భాస్కర్, డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, పర్యాటక శాఖ అధికారి పాండురంగారావు, సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పర్యాటకశాఖ అధికారి పాండురంగారావు మాట్లాడుతూ ఆదివారం మయూరి నర్సరి పార్కు ఆవరణలో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదిన మెప్మా ఆద్వర్యంలో పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలో, 27న శిశు సంక్షేమశాఖ కార్యాలయ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.
గ్రామంలో పండుగలను కలిసిమెలిసి చేసుకోవాలి
* మహబూబ్‌నగర్ ఎస్పీ అనురాధ
ఉట్కూర్, సెప్టెంబర్ 23: గ్రామంలో పలు పండుగలను ప్రతి ఒక్కరు కలిసిమెలిసి చేసుకోవాలని జిల్లా ఎస్పీ అనురాధ అన్నారు. శనివారం ఉట్కూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గ్రామస్థుల సమావేశాంలో జిల్లా ఏస్పీ అనురాధ మాట్లాడుతూ గ్రామంలో అందరు అన్నదమ్ముల కలిసి ఉండాలని,గ్రామంలో వచ్చే పనులను ఇరువర్గాల ప్రజలు స్నేహపూర్వకంగా జరుపుకోవాలని ఆమె సుచించారు.గ్రామంలో ప్రతి ఒక్కరు మంచిపేరును తీసుకురావాలని, గ్రామానికి వచ్చిన చేడ్డపేరును తోలగించేందుకు ఇరువర్గాల పేదలు, మహిళలు, యువకులు కృషి చేయాలని ఆమె కోరారు. గ్రామంలో వచ్చే దసరా, మొహరం పండుగలలో ఎలాంటి గొడవలు లేకుండా ఇరువర్గాల పెద్దలు చూసుకోనే బాద్యత ఉందన్నారు.అనంతరం బిజెపి రాష్టన్రాయకులు నింగిరెడ్డి ,హజమ్మ,కోండయ్య, డాక్టర్ లీయాఖతల్ మాట్లాడుతూ తప్పుచేసిన వారిని తప్పకుండా శిక్షించాలన్నారు. తప్పుచేయనివారిని శిక్షించడం ఎంతవరకు సమంజసమన్నారు.గ్రామంలో కొంతమంది అమాయకులు గోడవలులేనివారిపై కేసులు పెట్టి వారి జీవితాలను నాశనం చేయడం సరైందికాదన్నారు. గణేష్ నిమజ్జనంలో గ్రామంలో ఉన్న మహిళలపై ఇళ్లలోచోరబడి చితకబాదడం చాలా దారుణమన్నారు. ఇట్టివిషయంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గ్రామంలో యువత గోడవలలో ఉంటే భవిష్యత్తులో ఉద్యోగాలు రావన్నారు. యువత మంచిమర్గంలో నడవాలని ఆమె అన్నారు.గ్రామం అభివృద్దికి తన వంతు కృషి చేస్తాన్నారు. ఈకార్యక్రమంలో జడ్పిటిసి సూర్యప్రకాష్‌రెడ్డి, పేట డిఏస్పీ శ్రీనివాస్‌రెడ్డి,సిఐ వెంకట్, ఎస్సైలు సరసయ్య,నాయకులు శ్రీనివాస్,నారాయణరెడ్డి,శివరాములు,గోపాల్,బాల్‌రెడ్డి,లక్ష్మారెడ్డి,శేశప్ప,మహ్మద్ అలీ,కూర్సిద్, ఇబ్రహీం,నసిక్‌ఖాన్, ఆశప్ప,నర్సిములు,మోహన్‌రెడ్డి ,మహిళలలు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మండలానికి కెఎల్‌ఐ నీరు
తెల్కపల్లి, సెప్టెంబర్ 23: మండల ప్రజలు ఎంతో అతృతగా ఎదురుచుస్తున్న కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ నీళ్లు శనివారం కాల్వల ద్వారా మండలానికి చేరుకున్నాయి. రబీ సీజన్‌లో ప్రధానంగా వేరుశనగ పంట సాగుచేయడానికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీటి కోసం మండల రైతులు ఎంతో కాలంగా ఎదురుచుస్తున్నారు. కాల్వల ద్వారా మండలానికి నీళ్లు రావడంతో తమ తమ బోరు బావుల్లో సాగునీటి సమస్య తలెత్తదని ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా వచ్చే వేసవిలో తాగునీటి సమస్య తలెత్తదని చర్చించుకుంటున్నారు.

కన్నుల పండువగా మహా సుదర్శన యాగం

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 23: జిల్లాలోని రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడా శ్రీలక్ష్మీనారాయణ స్వామి దేవాయల ప్రాంగాణంలో శనివారం శ్రీ్ధన్వంతరి లక్ష్మీ సాహితి మహా సుదర్శన నారసాంహ యాగం కన్నుల పండువగా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ధర్మకర్త జనంపల్లి దిలీప్‌రెడ్డి తనయుడు ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిరుధ్ రెడ్డి చేపట్టిన సుదర్శన యాగంకు భక్తుల వేలాదిగా తరలివచ్చారు. ఈ సుదర్శనయాగానికి జిల్లా నలుమాలల నుండి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాగా, జడ్చర్ల ప్రాంతంలోని వివిధ గ్రామాల ప్రజలు తండోపతండాలు రావడంతో రంగారెడ్డిగూడ జనంతో కిక్కిరిసి పోయింది. ప్రజలు యజ్ఞంలో పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ సినియర్ నేత మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డికె అరుణ, సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, మాజీ ఎంపి మల్లురవితో పాటు పలువురు నేతలు పూజలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి అన్నదానం చేశారు. కార్యక్రమానికి విచ్చేన మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ సుదర్శనయాగం నిర్వహిస్తున్న దేవాలయ ధర్మకర్త దిలీప్‌రెడ్డి తనయులు అనిరుధ్ రెడ్డి, దుశ్వంత్‌రెడ్డిలను తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని కృతజ్ఞతలు కూడా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఇదో గొప్ప మహా కార్యక్రమం అని ప్రజలంతా బాగుండాలని కోరుకుని ఈ యాగం చేస్తుడటం గొప్ప మనస్సు గల వారికి మాత్రమే ఇలాంటివి సాధ్యమవుతాయని, ఇలాంటి యాగాల వల్ల ప్రజల్లో మంచితనం మరింత పెరుగుతుందని యాగం చేసేవారు వారు అనుకున్న లక్ష్యం కోసం నెరవేరుతుందని, ఇటువంటి యాగాలు జరుగుతున్నప్పుడు భక్తులు, ప్రజలు పాల్గొంటే వారిలో తప్పకుండా మార్పు వచ్చి మంచి మార్గంలో నడుస్తారని అన్నారు. ముఖ్యంగా ప్రతి మనిషిలో భక్తి భావం పెరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే డికె అరుణ మాట్లాడుతూ సంసృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఇలాంటి యాగాలకు తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకువస్తే చాలా మంచిదని అన్నారు. యాగం నిర్వహిస్తున్న వారికి తాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. మరో రెండు రోజుల పాటు ఈ యాగం ఉండడంతో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది.

ప్రజల సంక్షేమం కోసం గ్రామదేవతలు
* వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి
బాలానగర్, సెప్టెంబర్ 23: గ్రామ ప్రజల సంక్షేమం కోసం గ్రామదేవతలు ఎంతో అవసరమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం రాజాపూర్ మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రాంతంలో పూర్వికుల నుండి గ్రామదేవతలకు అధిక ప్రాధాన్యతను ఇస్తారని ఆయన అన్నారు. గ్రామప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా సుఖసంతోషాలతో తమ పిల్లపాపలతో ఉండాలని, పాడిపంటలు సంవృద్ధిగా పండాలని గ్రామదేవతలను కొలవడం మన ఆచారమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా టిఆర్‌ఎస్ పార్టీ ప్రసిడెంట్ శివకుమార్, సర్పంచు రామకృష్ణగౌడ్, నాయకులు మైపాల్‌రెడ్డి, బచ్చిరెడ్డి, యాదయ్య, పుల్లారెడ్డి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ మారితే నిధులు మారాయా?
-చైర్‌పర్సన్‌పై బిజెపి సభ్యుల ధ్వజం
నారాయణపేటటౌన్, సెప్టెంబర్ 23: పార్టీ ఫిరాయించగానే నిధులు ఎవరిచ్చారో తెలియని స్థితిలో మున్సిపల్ చైర్‌పర్సన్ అనవసర ప్రకటనలు చేయడం మానుకోవాలని మున్సిపల్ వైస్ చైర్మన్ నందునామాజీ, బిజెపి ఫ్లోర్ లీడర్ రఘురామయ్యగౌడ్‌లు సూచించారు. శనివారం వారు విలేఉరులతో మాట్లాడుతూ నారాయణపేట మున్సిపాలిటీ అభివృద్ధికి 14వ ఆర్థిక ప్రణాళిక ద్వారా కోటి 58లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు తీర్మానం చేసి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన విషయం విస్మరించారా అని ప్రశ్నించారు. దాంతో పాటు అధికారపార్టీలో చేరిన చైర్‌పర్సన్ నేటి వరకు మున్సిపాలిటీ అభివృద్ధికి రూపాయి మంజూరు చేయించుకోలేక సతమతమవుతూ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తే ప్రజలు క్షమించరన్నారు. తాను పార్టీ మారితే కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తే ప్రజలు క్షమించరని ఈ విషయాన్ని గుర్తుంచుకుని ప్రకటనలు చేయాలని కనీసం ఈ విషయాన్ని చైర్‌పర్సన్ విస్మరించడం వారి వివేకానికే వదిలేస్తున్నట్లు తెలిపారు. పట్టణాభివృద్ధిపై చైర్‌పర్సన్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులను తీసుకువచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేయాలని కేంద్రంపై విమర్శలు గుప్పిస్తే మాత్రం ఆధారాలతో సహా నిరూపించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో బిజెపి కౌన్సిలర్లు గౌతమిస్వామి, భారతమ్మ, రామలక్ష్మమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ బలోపేతానికే పర్యటన
* మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి
అమరచింత, సెప్టెంబర్ 23: మక్తల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు తను పర్యటన చేస్తున్నానని అమరచింత మాజీ ఎమ్మెల్యే కె.వీరారెడ్డి అన్నారు. శనివారం అమరచింతలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అయుబ్‌ఖాన్ నివాసంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మండల కార్యకర్తల సమావేశంలో ఆయన కుమారుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డితో పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 2014 లో టిఆర్‌ఎస్ గాలివీచిన అందరం కలిసికట్టుగా పనిచేసి మక్తల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రాంమోహన్‌రెడ్డిని గెలిపించుకున్నామని అన్నారు. ఆ తర్వాత ఆయన అధికార పార్టీలో చేరడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారని రాబోవు రోజుల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. రెండు సార్లు అమరచింత ఎమ్మెల్యేగా పని చేసిన తనకు అప్కాబ్ రాష్ట్ర చైర్మన్‌గా నియమించడంతో తను క్రీయశీల రాజకీయలకు దూరంగా ఉండవలసి వచ్చిందని అధిష్టానం రాబోవు రోజుల్లో ఎవరికి అవకాశం ఇచ్చిన సమష్ట్టిగా కృషి చేసి మక్తల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాకం సత్యనారాయణ, దేవరకొండలచ్చన్న, లీంగారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, జాల్గివెంకటేష్, అరుణ్‌కుమార్, జాన్ తదితరులు ఉన్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ‘పేట’కు ఎమ్మెల్సీ నిధులు
-ఎమ్మెల్సీ రాంచందర్‌రావు
నారాయణపేటటౌన్, సెప్టెంబర్ 23: నారాయణపేట నియోజకవర్గ అభివృద్దికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎమ్మెల్సీ నిధులను కేటాయిస్తానని ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు వెల్లడించారు. శనివారం సరాఫ్‌బజార్‌లోని బసవేశ్వరస్వామి దేవాలయం ముందు ఏర్పాటు చేసిన భవానిమాత విగ్రహానికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ కన్వీనర్ గందె చంద్రకాంత్, అధ్యక్షులు శ్రీనివాస్‌లాహోటీ తదితరులు సన్మానించారు. అనంతరం సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గంలోని పార్టీ సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జడ్పీటిసి, కౌన్సిలర్లు ఇతరత్రా ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో సరిపడా నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో బిజెపి విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలను ఇప్పటి నుండే అమలు చేయాలని పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు. సమావేశంలో బిజెపి రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రతంగ్‌పాండురెడ్డి, జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, ఎంపిపి మణెమ్మ, నియోజకవర్గ పార్టీ ఇంచార్జి రతంగ్‌పాండురెడ్డి, పట్టణ అధ్యక్షులు బోయ లక్ష్మణ్, నాయకులు కెంచె శ్రీనివాసులు, జాజాపూర్ సిద్రామప్ప, ఎబి చెన్నారెడ్డి, బి.మిర్చి వెంకటయ్య(ట్యాంకర్ల), నందునామాజీ, రఘురామయ్యగౌడ్, గౌతమిస్వామి, కమల, రామలక్ష్మమ్మ, వైస్ ఎంపిపి రామకృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం కావాలి
* మహబూబ్‌నగర్ కలెక్టర్ రోనాల్డ్‌రోస్
దేవరకద్ర, సెప్టెంబర్ 23: మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి సబ్సిడీ ద్వారా చేప పిల్లలను ప్రభుత్వమే చెరువుల దగ్గరికి అందిస్తుందన్నారు. శనివారం దేవరకద్ర మండలంలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో ఎర్పాటు చేసిన కేజి కల్చరల్ ద్వారా పెంచే చేప పిల్లలను ఆయన వదిలారు. ఈసందర్భంగా మత్స్యకారులతో ఎర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ రోనాల్డ్‌రోస్ మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకు 100శాతం సబ్సిడీ ద్వారా చేప పిల్లలను నేరుగా చెరువుల దగ్గరకు ప్రభుత్వమే పంపిణీ చేస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుకు 8యూనిట్లకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. మత్స్యకారులకు కేజి కల్చరల్ దగ్గకు వెళ్ళేందుకు 2లక్షల విలువ గల బోటును ఎర్పాటు చేస్తానన్నారు. మత్స్యకారులకు వ్యాపారం కోసం వినియోగించే వాహనాలు 75శాతంతో సబ్సిడీ ద్వారా అందించడం జరుగుతుందన్నారు. ఇందుకు లైసెన్స్‌లు ఉచితంగానే ఎర్పాటు చేస్తాన్నారు. మత్స్యకారులు పెంచిన చేపలను దళారులను అశ్రయించకుండా నేరుగా వ్యాపారం చేసుకుంటేనే అధిక లాభలు వస్తాయన్నారు. ఇందుకు కావల్సిన వసతులు ఎర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే మహబూబ్‌నగర్‌లో చేపల మార్కెట్ ఎర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత దేవరకద్ర, కొయిల్‌కోండలో కూడా చేపల మార్కెట్ ఎర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ దారులను ఇక్కడకు వచ్చి కొనుగోలు చేసే విధంగా చూస్తామన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ మురళికృష్ణ, ఎడి కదీర్‌హైమద్, సర్పంచ్ వెంకటేష్ ఎస్‌డిఓ అంజయ్య నాయకులు నారయణ, నర్సింహులు, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.