మహబూబ్‌నగర్

మహాలక్ష్మీగా కన్యకాపరమేశ్వరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 24: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మహబూబ్‌నగర్ పట్టణంలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారు నోట్ల కట్టతో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారు శరన్నవరాత్రి పూజల్లో భాగంగా మహాలక్ష్మిగా అలంకరించారు. దేవాలయ కమిటి సభ్యులు, భక్తులు సహకారంతో అమ్మవారిని రూ.1.25 కోట్లకు పైగా కరెన్సీ నోట్లతో సుదంరంగా అలంకరించారు. దేవాలయం అమ్మవారి గర్భగుడితో పాటు ఆలయంలోని ప్రధాన గర్భగుడి మొత్తం నోట్లతో అలంగారంగా తీర్చిదిద్దారు. కన్యకాపరమేశ్వరి అమ్మవారు మహాలక్ష్మీగా నోట్ల కట్టలతో దర్శనిమిస్తుందని పట్టణ ప్రజలకు సమాచారం అందడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున్న తరలిరావడంతో కన్యకాపరమేశ్వరి దేవాయలం భక్తులతో కిటకిటలాండింది.
బ్రహ్మాణ వాడ మొత్తం భక్తులతో సందడిగా మారింది.

నడిగడ్డపై బతుకమ్మ ఆశీస్సులు ఉండాలి

* బతుకమ్మ సంబురాల్లో ఎమ్మెల్యే డికె అరుణ
గద్వాల, సెప్టెంబర్ 24: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన బతుకమ్మ పండుగను జోగుళాంబ గద్వాల జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు అంగరంగా వైభవంగా జరుపుకుంటున్నారు. మాజీ మంత్రి వర్యులు, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బతుకమ్మ వేడుకలు సోమనాద్రి స్టేడియంలో కన్నుల పండుగా సాగింది. సాయంత్రం ఆరు గంటలకు డికె సత్యారెడ్డి బంగ్లా నుంచి బతుకమ్మలతో ఎమ్మెల్యే పాదయాత్రగా తేరు మైదానాన్నికి చేరుకున్నారు. వివిధ వార్డుల నుంచి ఏర్పాటు చేసిన బతుకమ్మలతో మహిళలు ఉత్సాహంగా చేరుకున్నారు. ప్రత్యేక డబ్బాలలో బతుకమ్మలను ఉంచి ఆటపాటలతో సంబురాలు జరుపుకున్నారు. మహిళలతో కలిసి ఎమ్మెల్యే డికెఅరుణ కోల్లాటం, బొడ్డెమ్మలు వేస్తూ వారిని మరింత ఉత్సాహ పరిచారు. అనంతరం మహిళలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ నడిగడ్డ ప్రజలు సుఖ శాంతులతో సుభిక్షంగా ఉండేందుకు బతుకమ్మ ఆశీర్వాదం ఎంతో అవసరమన్నారు. ఈ ప్రాంత ప్రజల అకాంక్ష, ఆత్మగౌరవ కోసం పోరాటాలు చేసి గద్వాల జిల్లాను సాధించుకున్నామని గుర్తు చేశారు. జిల్లా సాధన కోసం ఏ క్షణంలో పిలుపునిచ్చినా ఉద్యమంలో పాల్గొన్ని నాతో కలిసి నడిచిన నడిగడ్డ ప్రతి బిడ్డకు ధన్యవాదాలు తెలిపారు. గద్వాల నియోజకవర్గాని అన్ని రంగాలలో అభివృద్దిపరిచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాననీ ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ది పై అధికార పార్టీ వివక్ష చూపిస్తుందని విమర్శించారు. జోగుళాంబ, జమ్ములమ్మ తల్లి ఆశీస్సులు ఉన్నంత వరకు నడిగడ్డ ప్రజలకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకావని గుర్తుచేశారు. రాజకీయాలకు అతీతంగా జిల్లా అభివృద్ది కోసం పాటు పడేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మలతో తరలిరావడం పట్ల ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేస్తూ ప్రతి వార్డు బతుకమ్మల వద్దమహిళలతో కలిసి బొడ్డెమ్మలు వేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కృష్ణవేణి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బండల పద్మావతి, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రామాంజనేయులు, బండల వెంకట్రాములు, త్యాగరాజు, బాస్కర్ యాదవ్, డిటిడిసి నర్సింహ్మ, సుదర్శన్, అంజి, పాల్గొన్నారు.