మహబూబ్‌నగర్

ఎడాది చివరినాటికి నూరు శాతం పూర్తవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాపూర్, అక్టోబర్ 12: ఈ ఏడాది చివరి నాటికి నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చెయ్యాలని, లేని ఎడల పలు అభివృద్ధి పనులపై వేటు వేస్తామని అధికారులను, ప్రజాప్రతినిధులను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. గురువారం పట్టణంలోని మహబూబ్ ఫంక్షన్ హాల్ నందు స్వచ్ఛ భారత్ మిషన్‌పై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గ్రామాలలో స్మశానవాటిక పనులు, మరుగుదొడ్లు, డంప్ యార్డ్స్ పనులు జనవరి 1కల్లా పూర్తి చేయ్యాలని ఆదేశించారు. పెంట్లవెల్లి గ్రామ సర్పంచ్ కొట్ల సురేందర్, సింగోటం సర్పంచ్ వెంకటస్వామిలు మాట్లాడుతూ తమ గ్రామాలలో సెకరెట్రరీలు సహాకరించడంలేదని, జాబ్ కార్డులు ఇవ్వడంలేదని ఆరోపించారు. అక్కడే ఉన్న సెకరెటరీ ఎంపిడివోతో వివరణ తీసుకున్నారు. ఎలాంటి కారణాలు లేకుండా అర్హులైన వారికి జాబ్ కార్డులు ఇవ్వకుంటే క్రిమినల్ కేసులు పెట్టిస్తామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న పనులు చేయడానికి మీకు ఏమైందని అసహనంగా అధికారులపై మండిపడ్డారు. గ్రామాలలో వైకుంఠ గ్రామాల (స్మశానవాటికలు)కు స్థలాలు ఎంపిక చేసుకొని పనులు పూర్తి చేయ్యాలన్నారు. అదే విధంగా డంప్ యార్డ్స్ కోసం ప్రభుత్వ భూములను గుర్తించి త్వరత్వరగా నిర్మాణం పనులు చేయాలన్నారు. డంప్ యార్డ్స్ పనుల కోసం సర్పంచ్‌లు 14ఫైనాన్స్ నిధుల నుండి వాడుకోవచ్చాన్నారు. వారం పది రోజుల లోపల సమావేశం ఏర్పాటు చేసి మీరు తీసుకునే నిర్ణయాలు పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఏ గ్రామాలలో పనులు పూర్తికాకపోతే సిసి రహదారి పనులు, వివిధ అభివృద్ధి పనులను నిలిపివేస్తామని ఆయన హెచ్చరించారు. ఎంజి ఎల్ ఐ పథకం ద్వారా సాగు భూములు గడ్డి విస్తారంగా ఉన్నందునా పెద్ద ఎత్తునా మహిళలు పాడి గేదలను పెంచుకోవాలని, గేదేల కోసం మహిళలకు బ్యాంకుల నుండి రుణాలు ఇప్పించే ఏర్పాట్లు కూడా చేస్తామన్నారు. కల్వకుర్తి నుండి లక్ష లీటర్లు రోజుకు హైదరాబాదుకు పాల ఎగుమతి జరుగుతుందన్నారు. విస్తారంగా గడ్డి పుష్కలంగా, నీరు ఉందని మహిళలు పాడి గేదేలను పెంచుకోవడంలో ఆసక్తి చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్‌డివో సుధాకర్, డిపివో వెంకటేశ్వర్లు, స్పెషల్ ఆఫీసర్ సైదులుతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రరెడ్డి, జడ్పీటీసీ హనుమంత్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.