మహబూబ్‌నగర్

జూరాలకు భారీగా వరదనీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరచింత, అక్టోబర్ 17: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు సోమవారం అర్థరాత్రి నుంచి పెద్ద ఎత్తున వదరనీరు వస్తుంది దింతో పిజెపి అధికారులు 29 గేట్లను అయిదు మీటర్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మంగళవారం పిజెపి ఈ ఈ శ్రీధర్ విలేఖరులతో మాట్లాడుతూ ఎగువ ప్రాంతం నుండి జూరాలకు మొత్తం 192000 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉండగా 29 గేట్లను ఎత్తి సూపర్‌పాస్ట్ కేనాల్‌కు 160831, పవర్‌హౌస్‌కు 34000, ఎల్‌ఎంసి కేనాల్‌కు 730, ఆర్‌ఎంసి కేనాల్‌కు 583, ప్యారాలాల్ కేనాల్‌కు 250, క్యూసెక్కుల నీటిని విడుదల చేసి మొత్తం దిగువ బాగనికి 196,394 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లుగా ఆయన తెలిపారు. రాబోవు రెండు రోజుల వరకు మత్సకారుల చేపల వేట కోసం వెళ్లవద్దని హెచ్చరించారు.
బీచుపల్లి కృష్ణనదిలో యువకుడు గల్లంతు..
* గజ ఈతగాళ్ళ సహాయంతో గాలింపు చర్యలు
ఇటిక్యాల, అక్టోబర్17 : స్నానం చేసేందుకు వేళ్ళిన యువకుడు అందరూ చూస్తుండగా గల్లంతైన సంఘటన మంగళవారం మండల పరిధిలోని బీచుపల్లి కృష్ణానది పుష్కర్ ఘాటు దగ్గర చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్సై జగదీష్, గౌస్‌బాష స్నేహుతుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూర్ మండల కేంద్రానికి చెందిన గాంధీ, సాయికుమార్, భాస్కర్, గౌస్‌భాషలు తమ సొంత ఆటోలో కలసి వనపర్తి జిల్లాలోని పెబ్బేర్ మండల కేంద్రంలో చేపల కోసం వెళ్లారు. వారు అంతటితో తిరిగి భూత్పూకి వెళ్లకుండా బీచుపల్లి పుణ్యక్షేత్రంలో స్నానం చేసేందుకు వెళ్ళారు. అందులో గాందీ, సాయికమార్‌లు చేపలను వేటాడుతుండగా భాస్కర్, గౌస్‌బాషలు స్నానం చేస్తున్నారు. ప్రమాదవశాత్తుతో గౌస్‌భాష(21) నదిలో గల్లంతయ్యాడని వారు తెలిపారు. అక్కడ ఉన్న స్థానికులు ఇటిక్యాల పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై జగదీష్ తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకోని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బీచుపల్లి పుష్కర ఘాట్ వద్దకు చేరుకొని బోరున విలపించారు.