మహబూబ్‌నగర్

ప్రభుత్వ పథకాలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, అక్టోబర్ 17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న పథకాలు ప్రజలకు అందిస్తున్న జీవనోపాధి ఫలితాలు బాగున్నాయని కేంద్ర గ్రామీణభివృద్ది శాఖ పరిశీలన కమిటి సభ్యులు ఎన్‌ఎం రాజు, భైజాన్‌లు అన్నారు.మంగళవారం వెల్దండ మండలం బోల్లంపల్లి, కొట్ర గ్రామల్లో కేంద్ర గ్రామీణభివృద్ది పరిశీలన బృందం సభ్యుడు ఎన్‌ఎంరాజు, భూజాన్‌ల అద్వర్యంలో వేర్వురుగా ప్రభుత్వ పథకాల అమలు తీరు తెన్నులపై అధ్యయనం చేశారు. అనంతరం అయా గ్రామల సర్పంచులు వసుపుతమ్మ, గీతారాణిల అధ్యక్షతన జాతీయ పరిశీలన బృందం సభ్యులు గ్రామస్థులతో సమావేశమై అమలు, తీరు తెన్నులపై అరా తీసారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం,మహిళ సంఘల రుణాలు, చెల్లింపులు, శ్రీనిధి, అంగన్‌వాడి, పంచాయతి రాజ్ పనులు , వ్యక్తిగత మరుగుదొడ్లు తదితర పథకాలపై రాజు, భైజాన్‌లు సంబందిత స్థానిక అధికారులతో పాటు గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమంలో ఎంపిడిఓ వెంకటేశ్వర్‌రావు, ఎపిడి గోవిందరాజన్, ఎపిడిలు శ్రీనివాసులు, గోవిందారాజులు, ఎంపిడిఓ వెంకటేశ్వర్‌రావు, ఎంపిటిసిలు కడారికృష్ణయ్య, జయప్రకాష్, ఎపిఓ లక్ష్మయ్య, ఎపిఎం రాములునాయక్, అధికారులు వేణుగోపాల్‌రెడ్డి, రాజ్‌కుమార్, జగన్‌లాల్,లాలయ్య, ధీపిక, చెన్నయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ఉద్ధృతి
శ్రీశైలం ప్రాజెక్టు, అక్టోబర్ 17: కృష్ణా నది పరివాహాక ప్రాంతం నుండి వస్తున్న వరదతో మంగళవారం రోజు శ్రీశైలం ప్రాజెక్టు ఎనిమిది గేట్లను ఎత్తి నాగర్జుసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఏడు గంటల సమయానికి జూరాల నుండి 194349 క్యూసెక్కులు, రోజా నుండి 31393క్యూసెక్కులు, హంద్రీ నుండి 200క్యూసెక్కుల నీరు, మొత్తం 225902క్యూసెక్కుల నీరు వచ్చి చేరుకున్నది. కాగా కుడి గట్టు పవర్‌హౌజ్ ఏడు జనరేటర్ల ద్వారా విద్యుదుత్పతి చేస్తూ 30238క్యూసెక్కులు, భూగర్భ పవర్‌హౌజ్ ఆరు యూనిట్ల ద్వారా విద్యుదుత్పతి చేస్తూ 42378, ఆరు సీల్‌వే గేట్ల ద్వారా 165420క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ద్వారా 11000క్యూసెక్కులు, కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ ద్వారా 2400క్యూసెక్కుల నీటిని మొత్తం 256078క్యూసెక్కుల నీటిని నిల్వ చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు వస్తున్న వరద ఉదృతిని బట్టి సీల్‌వే గేట్ల పెంచడం, తగ్గించడం చేస్తున్నారు. గేట్లు ద్వారా వదిలిన నీటి దృశ్యాలను చూడడానికి హైదారాద్ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చి చూసి వెళ్తున్నారు.