మహబూబ్‌నగర్

డెంగీ నివారణకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 17: జిల్లాలో డెంగీ నివారణకు ప్రజల బాగస్వామ్యం తప్పనిసరి అని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ రెవెన్యూ మీటింగ్ హాల్‌లో డెంగీ నివారణకై మహబూబ్‌నగర్ మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు వారి విధులను సక్రమంగా నిర్వహించాలని బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరు ఉంటేనే డెంగీ వ్యాధి బారిన పడకుండా ప్రజలు ఉంటారనన్నారు. వ్యాధుల నియంత్రణలో ప్రభుత్వ శాఖల అధికారుల బాధ్యత మాత్రమే కాదని ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని తెలిపారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని పలు కాలనీలలో ప్రజలు డెంగీ వ్యాధి బారిన అధికంగా పడుతున్నందున వ్యాధి నివారణలో భాగంగా డెంగీ వ్యాధి దోమ కుట్టడం వల్ల వ్యాధి సోకకుండానే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదన్నారు. పట్టణంలోని అన్ని వార్డులలో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పాలమూరు పట్టణం అభివృద్ధి దిశగా పరుగులు వేస్తుందని అభివృద్ధి కొనసాగుతున్న నేపథ్యంలో వ్యాధుల నియంత్రణపై కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. అభివృద్ధికి దిక్సూచిగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. అందులో భాగంగానే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఐటి, మల్టీమీడియా కంపెనీల ఏర్పాటుకు అన్ని చర్యలు చేపడుతున్నామని అనేక మంది ఎన్నో విమర్శలు చేస్తున్నా వాటికి చేరమగీతం పాడుతూ ఒర్వలేని కొందరు అభివృద్ధి జరుగుతున్న కడుపుమంటతో ఆరోపణలు చేస్తున్నారన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ఎంతో కృషి చేస్తున్నామని తెలిపారు. డెంగ్యూవ్యాధి సోకకుండా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని 15,16,17,18 వార్డులలో డెంగీ కేసులు అధికంగా నమోదు అవుతున్నందున ఈ వార్డులలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. మున్సిపాలిటీలో హెల్త్ అధికారి ఉండాలని అయితే ముగ్గురు అధికారులను డిప్యూటేషన్‌పై ఏర్పాటు చేస్తున్నామన్నారు. వందకోట్ల అభివృద్ధి కేవలం మున్సిపల్ నిధుల నుండే కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు అవగాహన లేక దోమల నివారణ కోసం ఫాగింగ్ చేయాలని కోరుతున్నారని అయితే ఫాగింగ్ చేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఊపిరితీత్తులకు ఫాగింగ్ ద్వారా ఆరోగ్య సమస్య వస్తుందన్నారు. ముఖ్యంగా ప్రజలు తమ ఇళ్లల్లో పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్, వైస్ చైర్మన్ రాములు, కమిషనర్ దేవ్‌సింగ్‌నాయక్ పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్లలో ఎస్పీ తనిఖీ
అడ్డాకుల, అక్టోబర్ 17: అడ్డాకుల, ముసాపేట పోలీస్‌స్టేషన్లను మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ అనురాధ ఆకస్మీకంగా తనిఖీ చేశారు. అదేవిధంగా దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్ పోలీస్‌స్టేషన్‌ను కూడా ఎస్పీ తనిఖీ చేశారు. ఈ మూడు పోలీస్‌స్టేషన్లలో ఎస్పీ రికార్డులను పరిశీలించారు. అలాగే సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. కేసుల విషయాల్లో కూడా అడిగి తెలుసుకున్నారు. అడ్డాకుల మండల పోలీస్‌స్టేషన్ ప్రాంగణం ఆహ్లదకరంగా ఉందని పచ్చదనాన్ని మరింత పెంపొందించాలని పోలీసులకు సూచించారు. జాతీయ రహదారి ఉన్నందున ఈ మూడు పోలీస్‌స్టేషన్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాహనాల వేగాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జాతీయ రహదారిపై తనిఖీలు సైతం చేపట్టాలన్నారు. గ్రామాల్లోని ప్రజలకు పోలీసు చట్టాలపై అవగాహన కల్పిస్తూనే జాతీయ రహదారి పక్కలో గల గ్రామాల ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణకై యువతలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు. పోలీస్‌స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల బాధలను తెలుసుకుని వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఎంతో నమ్మకంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తారని ఆ నమ్మకాని వమ్ము చేయకుండా పనిచేయాలన్నారు. కేసుల పరిశోధనలో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే నేరగాళ్లు తప్పించుకునే అస్కారం ఉండదని నేరగాళ్లకు చట్టపరంగా శిక్షలు పడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ భాస్కర్, సిఐ రవీందర్‌రెడ్డి, ఎస్సై మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.