మహబూబ్‌నగర్

రోజురోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోస్గి, అక్టోబర్ 22: టిటిడిపి వర్కింగ్ ప్రసిడెంట్, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నాడన్న సమాచారంతో కొడంగల్ నియోజకవర్గ రాజకీయాల్లో ఒక్కసారిగా రాజకీయ వేడి మొదలైంది. ఇదివరకు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని నమ్ముకుని టిడిపిలో కొనసాగిన నేతలంతా ఎటు వెళ్ళాలో అనే తర్జనభర్జనలో ఉన్నారు. ఇదే అదునుగా చేసుకున్న టిఆర్‌ఎస్ నేతలు టిడిపి నాయకులకు గాలం వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మద్దూర్ జడ్పీటిసి అనుసూజ టిడిపిని వీడి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఎంపిపి సంగీత టిడిపిలో గెలిచి గతంలోనే టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆమె వెంట మరికొంత మంది ఎంపిటిసిలు సైతం టిఆర్‌ఎస్‌లో చేరారు. అదేవిధంగా కొడంగల్ ఎంపిపి దయాకర్‌రెడ్డి సైతం టిడిపిని వీడి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఇలా టిడిపికి పటిష్టంగా ఉన్న కీలకనేతలంతా టిఆర్‌ఎస్‌లో చేరడంతో టిడిపికి కంచుకోటలా ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ హవా కొనసాగించేందుకు అధిష్టానం పావులు కదుపుతోందని చెప్పవచ్చు. టిటిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో వెళ్లడానికి సన్నద్ధమైన నేపథ్యంలో ఆ పార్టీ సినియర్ నేతలంతా వ్యతిరేకిస్తున్నారన్న సమాచారంతో నియోజకవర్గంలోని సినియర్ నేతలు కూడా ఆయన రాకను ససేమీరా అంటున్నారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి చేరడంతో ఆయన అనుచరులకు పార్టీలో కీలక పదవులు ఇస్తే ఇన్నాళ్లు కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కాపాడిన తమకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ సినియర్ నేతలు చెప్పుకోస్తున్నారు. ఏది ఎమైన కొడంగల్ రాజకీయాల్లో పెనుమార్పులు జరుగుతాయన్న మాట నిజమనిపిస్తుంది.
జూరాలకు తగ్గుముఖం పట్టిన వరదనీరు
అమరచింత, అక్టోబర్ 22: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతం నుంచి గత వారం రోజులగా వస్తున్న వరదనీరు క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఆదివారం ప్రభుత్వ సేలవు దినం కావడంతో సందర్శకులతో జూరాల ప్రాజెక్ట్ ప్రాంతం రద్దీగా ఉండగా ఎగువ ప్రాంతం నుంచి ఇన్ ఫ్లో 32000 క్యూసేక్కుల నీరు వస్తుండగా 8 షెటర్లును అయిదు మీటర్ల ఎత్తు ఎత్తి 42000 క్యూసేక్కుల నీటిని దిగువకు వదులుతున్నామని పిజెపి అధికారులు తెలిపారు.
ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ అవసరం
* ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్‌టౌన్, అక్టోబర్ 22: ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవల్సిన అవసరం ఎంతైన ఉందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం కింగ్‌షోటోకాన్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో జిల్లా స్థాయి కరాటే టోర్నీ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్‌కు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడిందని అందుకోసం నియోజకవర్గంలోని మైనారిటీ గురుకులాల్లో విద్యార్థులకు కరాటే నేర్పించేందుకు తన వంతు సహయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించినప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్ మాట్లాడుతూ చిన్నారులకు కరాటే నేర్చుకునేలా తల్లిదండ్రులు ప్రొత్సహించాలని కోరారు. పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు కరాటే శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, క్లబ్ అధ్యక్షుడు మహముద్‌అలీ, లక్ష్మణ్, ఫౌండర్ జహంగీర్‌పాషఖాద్రి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.