మహబూబ్‌నగర్

ప్రశాంతంగా ఎస్సై రాత పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 17: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పోలీస్‌శాఖలోని ఎస్సై ఫోస్టుల భర్తికిగాను రాత పరీక్షల్లో భాగంగా ఆదివారం జిల్లాలో కూడా రాత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రాత పరీక్షకుగాను మహబూబ్‌నగర్ పట్టణంలో 26 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నాం ఒంటిగంట వరకు ప్రశాంతంగా పరీక్షలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 11988 మంది అభ్యర్థులు పరీక్ష రాయల్సి ఉండగా అందులో 11451 మంది పరీక్షకు హాజరయ్యారు. 537 మంది గైర్వాజర్ అయ్యారు. పరీక్షలు జరుగుతున్న సందర్భంగా జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ అన్ని పరీక్షా కేంద్రాలను సందర్శించారు. ఎస్సై రాత పరీక్షలు ప్రశాంతంగా జరగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా అభ్యర్థులు పరీక్ష సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాల దగ్గరకు వచ్చి బారులు తీశారు. ఈ పరీక్షలకు ప్రతి 24 మంది అభ్యర్థులకు ఒక ఇన్వీజిలేటర్ చొప్పున మొత్తం 500 మందికి పైగా ఇన్వీజిలేటర్లను విధులు నిర్వర్తించారు. 36 మందిని పరీక్షల పరిశీలకులుగా విధులు చేపట్టారు. పరీక్షా కేంద్రాలను ఐదు రూట్లుగా విభజింజి పరీక్షల నిర్వహణ తీరును ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ పరిశీలించారు. జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్‌తో పాటు అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్‌రావు. మహబూబ్‌నగర్ డిఎస్పీ కృష్ణమూర్తిలు జిల్లా కేంద్రంలోని పరీక్షల కేంద్రాల దగ్గర బందోబస్తుపై అరా తీశారు. పరీక్షలు ప్రశాంతంగా జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.