మహబూబ్‌నగర్

అన్నదాత అనందంతో దేశం సుభిక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, నవంబర్ 18: అన్నదాతలు ఆనందంగా ఉన్నప్పుడే దేశం సుభిక్ష్యంగా ఉంటుందని వేద పండితులు తిప్పయ్యస్వామి అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తికమాస ఆమావాశ్య దినోత్సవాన్ని పురష్కరించుకొని దేవాలయ అర్చకులు, వేద పండితులైన తిప్పయ్యస్వామి శనివారం వడ్లగింజలతో శివలింగాన్ని అలంకరించిన అలంకరణ భక్తుల హృదయాలను ఎంతగానో అకట్టుకుంది. గత 9సంవత్సరాలుగా విశేష అలరంకణలు చేస్తున్నారు. ఈసందర్భంగా తిప్పయ్యస్వామి మాట్లాడుతూ ప్రతి రైతు పండించిన పంటలతో నేడు మనందరం జీవిస్తున్నామే తప్పా ఆరైతు కన్నీళ్లు తూడ్చే వారే కానరారని అన్నారు. ప్రతి సంవత్సరం వరుణుడు కరుణించి పంటలు సంవృద్ధిగా పండి రైతులకు గిట్ట్ధురలు వచ్చినప్పుడే అటు రైతుల్లోను, ప్రజల్లోను సంతోషాన్ని చూడగలమని స్వామీజీ అన్నారు. నేడు ఎంతో మంది రైతులు అతివృష్టి, అనావృష్టి, అప్పుల ఊభిలో కూరుకపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని స్వామీజీ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నేడు వడ్ల గింజలతో శివలింగాన్ని అలంకరించడం జరిగిందని తిప్పయ్యస్వామి తెలిపారు. నర్సమ్మ, పరుశరాం, కమలమ్మల ఆధ్వర్యంలో మందిరంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే 1116 కార్తీక దీపాలను వెలిగించడం జరిగిందని తిప్పయ్యస్వామి తెలిపారు.