మహబూబ్‌నగర్

మిషన్ కాకతీయ చెరువు పనులపై... విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దకొత్తపల్లి, నవంబర్ 18: మిషన్ కాకతీయ చెరువు పనులలో వెన్నచెర్ల గ్రామ పెద్ద చెరువు పనుల్లో భారీగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇట్టి పనులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలని కొల్లాపూర్ తాలుకా కాంగ్రెస్ పార్టీ ఇంజార్జీ బీరం హర్షవర్ధన్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. శనివారం వెన్నచెర్ల గ్రామ పెద్ద చెరువు కట్టపై ఏర్పడిన రంధ్రాలను వారు పరిశీలించారు. అనంతరం మిషన్‌కాకతీయ ఇ ఇ గోవిందు, ఎస్సీ ఆనంద్‌కుమార్‌లను చెరువుకట్ట వద్ద కాంగ్రెస్, సీపీఐ పార్టీ నాయకులు నిలదీయగా అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు చెరువులోని వండ్రుమట్టిని తమ పొలాలకు తరలించుకుంటే అట్టి గుంతలకు లక్షలలో బిల్లులు అధికారులు చేసి అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలికారని హర్షవర్ధన్‌రెడ్డి అధికారులపై ధ్వజమెత్తారు. రూ. 1కోటి 30లక్షలతో వెన్నచెర్ల గ్రామ పెద్ద చెరువు కట్టపనులు చేపట్టారని, ఆ పనులలో నాణ్యత లేకపోవడం అధికారులకు కమిషన్‌లే కారణమని విమర్శించారు. మండలంలోని చంద్రకల్ గ్రామంలో అధికార పార్టీ నాయకులు కాకుండా ఇతరులు చేసిన మూడు కుంటలకు బిల్లులు చెల్లించకుండా అధికార పార్టీ నాయకులు చేసే ఒత్తిడికి అధికారులు తలొగ్గడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడిన మిషన్ కాకతీయ పనుల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీపీ, జడ్పీటీసీల హస్తం ఉందని వారు అన్నారు. చిన్న గ్రామాలలో ఉన్న చెరువుల కట్టల పనులే నాణ్యత చేపట్టని అధికారులు పెద్దపెద్ద చెరువు పనులను నాణ్యతగా ఎలా నిర్మిస్తారని, దీనిపై మంత్రి హరీష్‌రావు తక్షణమే సందర్శించి పరిశీలించి అవినీతికి కారణమైన వారిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. చెరువు కట్ట రంద్రాలను మోర్రం పోసీ రంద్రాలను పూడ్చడం పట్ల అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. చెరువు కింద ఉన్న వరి పంట రైతులకు అన్యాయం జరిగితే, రైతులతో కలిసి గ్రామ పంచాయతీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు రైతుల గోడు వినండి అని అధికార పార్టీ నాయకుల చెవులు వినపడేంత వరకు పాద యాత్ర చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గణేష్‌రావు, అరవిందు, పవన్‌కుమార్ శర్మ, లక్ష్మణ్‌గౌడ్, కాశయ్య, రాంలాల్‌నాయక్, కృష్టయ్య, రవి, సీపీఐ నాయకులు చెన్నయ్య, కిష్టయ్య, వెంకటయ్యలు ఉన్నారు.

మిషన్ భగిరథ పనులను అడ్డుకున్న గ్రామస్థులు
దేవరకద్ర, నవంబర్ 18: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ పనులను మండల పరిధిలోని పెద్ద గోప్లాపూర్ గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో పనులు నిలిచిపోవడంతో రెవెన్యూ, పోలీసులు సంఘటన స్థలం చేరుకోని విచారించడంతో గ్రామస్తులంతా మా పట్టా పోలంలో ఎలాంటి డబ్బులు చెల్లీంచకుండా రోడ్డు వేశారని హైకోర్టును అశ్రయించామని ఇందుకు పనులు నిలుపుదల చేయాలని స్టే అర్డర్ ఇచ్చారని అధికారులకు తెలపడంతో వెనుదిరిగిపోయారు. ఇప్పటికి మూడు సార్లు వెనకి మళ్లిపోయిన అధికారులు మాత్రం మాపోలం డబ్బులు చెల్లీంచకుండా, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని గ్రామస్థులు తెలుపుతున్నారు. అడ్డుకున్న వారిలో ప్రశాంత్, మోహన్‌రెడ్డి, చంద్రయ్య, బాబు, హేమ, లలిత, ప్రకాష్, తదితరులున్నారు.