మహబూబ్‌నగర్

అంబేద్కర్ అందరివాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 19: అంబేద్కర్ ఒక వర్గానికో, కులానికి సంబందించిన వాడు కాదని అందరి వాడని పిఎస్‌సి చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. మంగళవారం పాలమూరు యూనివర్సిటిలోని సెమినర్ హల్‌లో అంబేద్కర్ 125వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ను విశ్వ మానవుడిగా ప్రపంచమంతా గుర్తిస్తుందని తెలిపారు. కొలంబియా, జపాన్ వంటి యూనివర్సిటీల్లో అంబేద్కర్ చిత్రపటాలను ఏర్పాటు చేయడం అందుకు నిదర్శనమని అంబేద్కర్ తన జీవితమంతా దేశసేవకే అంకితం చేశారని ఆయన కొనియాడారు. ప్రజాస్వామ్యం, స్థానిక ప్రభుత్వం, సార్వత్రిక ఓటును మొట్టమొదటిగా గుర్తించారని తెలిపారు. ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారిన అంబేద్కర్‌ను కులం ప్రతిపాదికగా గుర్తించడం భావ్యం కాదన్నారు. ఆధునిక భారతదేశ వ్యవస్థాపక నిర్మాతగా ఆయనను చెప్పుకొవచ్చని అన్నారు. బలహీనులకు అధికారం వస్తే బలవంతుడు ఆధిపత్యాన్ని తొలగించవచ్చని నమ్మిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. దళితులు విద్యపరంగా, ఆర్థికంగా బలపడినప్పుడే అభివృద్ధి సాధ్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని దానికి ఉదాహరణ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసి ఆర్ హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహా ఏర్పాటుకు శంకుస్థాపన చేశారని రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించాలని తెలిపారు. ఆయన ఆశయాలను నెరవేరేలా సమాజంలో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ భాగ్యనారాయణ, ప్రొఫెసర్ వినోద్‌కుమార్, శ్రీనాథచారి, పాండురంగారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.