మహబూబ్‌నగర్

ధీరవనిత ఇందిరా గాంధీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, నవంబర్ 19: దేశం సంక్లిష్ట సమయంలో ఉన్న సందర్భంలో ప్రధానిగా మాజీ భారత ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ దైర్య సహాసాలు ప్రదర్శించి సమర్థవంత పాలనను అందించినందున ఉక్కు మహిళగా ప్రపంచ ఖ్యాతిని సాధించారని ఎఐసీసీ కార్యదర్శి, వనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం ఇందిరాగాంధీ 100వ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని ఇంధిరా కాలనీలో ఇందిరాగాంధీ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత ప్రధానిగా స్వర్గీయ ఇందిరాగాంధీ దళిత, పేద వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని అన్నారు. భారత తొలి మహిళా ప్రధానిగా చరిత్రలో నిలిచారన్నారు. వీర వనితగా, ఉక్కు మనిషిగా పేరుగాంచారన్నారు. నెహ్రు శిక్షణలో రాజకీయ పాఠాలు నేర్చిన ఇందిరాగాంధీ సమర్థవంత పాలన సాగించారన్నారు. పార్టీ పెద్దలు పదవీ నుంచి తొలగించాలని చూసినప్పటికి వారికి ఎదురొడ్డి నిలిచి లక్ష్యాన్ని సాధించారన్నారు. నేటి తరానికి ఆమె ఆదర్శ ప్రాయురాలని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంచుకున్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్‌ప్రసాద్, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, కిరణ్‌కుమార్, శివసేనారెడ్డి, రాగివేణు, తిరుపతయ్య, సురేష్‌గౌడ్, పాండురావు, ఖమ్మర్ మియా, భువనేశ్వరి, కృష్ణబాబు, లక్ష్మి, గణేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇంధిరాచౌక్‌లోగల ఇంధిరమ్మ నిలువెత్తు విగ్రహానికి ఎ ఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి పూలమాల వేసి నివాళు అర్పించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రేడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్‌ప్రసాద్, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, కిరణ్‌కుమార్, రాగివేణు, తిరుపతయ్య, భువనేశ్వరి, కృష్ణబాబు, శివసేనారెడ్డి, శ్యామ్‌కుమార్, బాబా, జాన్, నందిమల్ల చంద్రవౌళి, రవిప్రకాష్‌రెడ్డి, బాలరాజు పాల్గొన్నారు.