మహబూబ్‌నగర్

ప్రజోపకర కథనాలకు ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, నవంబర్ 21: జర్నలిజంలో సెనే్షషన్ వార్తల కంటే ప్రజోపకర కథనాలకు ప్రాధాన్యతను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ శే్వతామహాంతి అన్నారు. మంగళవారం వనపర్తి ఎంవై ఎస్ ఫంక్షన్ హాల్‌లో జిల్లాలోని జర్నలిస్టులకు ఉచితంగా హెల్మెంట్ల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ శే్వతామహాంతి, ఎమ్మెల్యే చిన్నారెడ్డి, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, టీయుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహాత్ ఆలీ, నాయకులు వెంకటేశ్వర్‌రావు, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిత్యం బిజీగా ఉండే జర్నలిస్టులు హెల్మెంట్లను వాడి అందరికి మార్గదర్శం అవడమే కాకుండా వారి కుటుంబాలను కాపాడుకునే వారవుతారని అన్నారు. జర్నలిస్టులకు వీలైనంత సహకారం అందించేందుకు ప్రయత్నిస్తామని ఆమె అన్నారు.
ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పత్రికలు కీలకమని ముఖ్యమంత్రి స్థాయి నుండి సర్పంచు స్థాయి వరకు పత్రికలను చదువుతూ మంచి చెడ్డలను స్వీకరిస్తుంటామని అన్నారు. వనపర్తి జర్నలిస్టులు మరింత సమర్థవంతంగా పని చేసి రాష్ట్రంలో మంచి పేరు ప్రాఖ్యాతలు తీసుకు రావాలన్నారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకా వనపర్తి జర్నలిస్టులకు ఉచితంగా హెల్మెంట్లను పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని అందుకు సహాకారం అందించిన శివాసేనారెడ్డిని ఆమె అభినందించారు. ప్రతి ఒక్కరు హెల్మెంట్లు ధరించి వారి ప్రాణాలను కాపాడుకోవాలని అన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహాత్ ఆలీ మాట్లాడుతూ నిత్యం ప్రజల కోసం పని చేస్తున్న జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇవ్వాలని, ప్రతి జర్నలిస్టులకు అక్రిడియేషన్ ఇవ్వాలని అన్నారు. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు మధుగౌడ్ అధ్యక్షత వహించారు. అనంతరం బైకు ర్యాలీని ఎస్పీ ప్రారంభించారు.