మహబూబ్‌నగర్

విద్యాభివృద్ధికి పెద్దపీట: గువ్వల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, డిసెంబర్ 14: విద్యాభివ్దృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ అన్నారు. గురువారం చారకొండ మండల కేంద్రంలో రూ.31లక్షలతో నిర్మించే ఎమ్మార్సీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బాల్‌రాజ్ శంకుస్థాపన చేసి, స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు గదులను ప్రారంభించి, అందులో తాత్కలికంగా కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యతోనే ప్రగతి సాధ్యమని గుర్తిరెగి ప్రాధాన్యతను ఇస్తు అత్యధిక నిధులను వెచ్చిస్తోందన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న విద్యపథకాలను విద్యార్థులు అందిపుచ్చుకొని రాణించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులపైనే దేశ భవిష్యత్తు అధారపడి ఉందని, విద్యార్థులు కష్ట, ఇష్ట పడి చదివి ప్రయోజకులు కావలని సూచించారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిర్దేశించుకున్న లక్ష్యన్ని చేరుకోవాలని కోరారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని దాని సాధన కోసం సమయాన్ని వృథాచేయకుండ చదుకోవాలని కోరారు. ముఖ్యంగా ప్రతి పక్షాలు అభివృద్ధి నిరోధకులుగా తయారు అవుతున్నారని, కేవలం ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయడం తప్ప అభివృద్ధికి ఎంతమాత్రం సహకరించడం లేదని విమర్శించారు. ప్రజారంజాక పాలనను అందిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని కోరారు. అదేవిధంగా స్థానిక పాఠశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ దృష్టికి తీసుకురాగా 10రోజుల్లో నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయిస్తానని హమీనిచ్చారు. అదే విధంగా టీడీపీకి చెందిన మాజీ వైస్ ఎంపీపీ జోగు అంజయ్యతో పాటు పలువురు ఎమ్మెల్యే బాల్‌రాజ్ సమక్షంలో టీఅర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్ధన్‌రావు, ఎంపిపి భాగ్యలక్ష్మి, జడ్పీటిసి భీముడునాయక్, సర్పంచ్ శిల్ప, ఉప సర్పంచ్ పద్మ, విద్యాధికారి శంకర్‌నాయక్, టిఅర్‌ఎస్ మండల అధ్యక్షుడు గురువయ్యగౌడ్, హెచ్‌ఎం సాంబయ్య, నాయకులు విజేందర్‌గౌడ్, జంగయ్యగౌడ్, అంజిగౌడ్, సత్యం, అనంద్, రామకృష్ణ, నవీన్‌గౌడ్ పాల్గొన్నారు.
క్రీస్తు బోధనలు ప్రపంచానికే ఆదర్శం
* జెసి నిరంజన్

వనపర్తి, డిసెంబర్ 14: యేసుక్రీస్తు భోదనలు ప్రపంచానికే ఆదర్శమని జాయింట్ కలెక్టర్ నిరంజన్‌రావు అన్నారు. గురువారం జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రీస్టియన్ పండుగ సందర్బంగా వనపర్తిలోని జరుసలేం చర్చిలో ఏర్పాటు చేసిన దుస్తుల పంపిణి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని క్రీస్టియన్లందరు క్రీస్‌మస్ పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని కొరారు. క్రీస్టియన్లకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహయ సహకారాలు అందిస్తున్నదని, క్రీస్టియన్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకరావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ రవి, జిల్లా మైనార్టి సంక్షేమ శాఖ అధికారి ఫయాజ్‌అహ్మద్, తహశీల్దార్ రాజేందర్‌గౌడ్, కౌన్సిలర్ గట్టుయాదవ్, దుస్తుల పంపిణీ కమిటీ అద్యక్షులు కృష్ణపాల్, గంధం విజయ్ పాల్గొన్నారు.