మహబూబ్‌నగర్

పాలమూరుతో ప్రతి ఎకరాకు సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 17: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును నిర్మించి తీరుతామని దాంతో మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు మరో నాలుగు జిల్లాలలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం భూత్పూర్, అడ్డాకుల మండలాల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూత్పూర్, అడ్డాకుల మండలాలకు సంబంధించిన వివిధ గ్రామాలలోని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహయ నిధి చెక్కులను అన్నాసాగర్ గ్రామంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృత నిశ్చయంతో పని చేస్తుందని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని కర్వెనా రిజర్వాయర్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, ఈ రిజర్వాయర్ పూర్తి అయితే ఇక్కడి నుండి వివిధ నియోజకవర్గాలతో పాటు దేవరకద్ర నియోజకవర్గంలోని పలు మండలాలకు సాగునీరు అందుతుందని దాంతో రైతుల కష్టాలు పూర్తిగా తొలగిపోతాయని అన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు పనులు 50 శాతంకు పైగా పూర్తి కావల్సి ఉండేదని కానీ కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టుపై కేసులు వేయడంతో పనుల్లో కొంత ఆలస్యం ఏర్పడిందని అయితే ఒక్కొక్కటిగా సమస్యలను అధిగమిస్తూ ప్రాజెక్టు పనులను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కర్వెనా, ఏదుల, నార్లాపూర్ పనులు జోరుగా కొనసాగుతున్నాయని భూ సేకరణ సైతం ఈ మూడు రిజర్వాయర్ల కింద దాదాపు పూర్తి అయిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రాజెక్టులపై మంచి అవగాహన ఉందికాబట్టే కాంగ్రెస్ నాయకులు కేసులు వేసిన వాటిని చట్టబద్ధంగానే ఎదుర్కొంటూ సమస్యలు పరిష్కరిస్తూ ప్రాజెక్టులకు జరుగుతున్న ఆటంకాలను అధిగమిస్తున్నారని అన్నారు. పలుమార్లు కోర్టులు కూడా కాంగ్రెస్ నాయకులకు మొట్టికాయలు పెట్టిన వారికి ఇంకా బుద్ధి రావడంలేదని విమర్శించారు. దేవరకద్ర నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తుందని అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాలకు సాగునీరు అందుతోందని భీమా ప్రాజెక్టు ద్వారా కొత్తకోట, మదనాపురం మండలాలకు సైతం కృష్ణా జలాలు అందుతున్నాయని అన్నారు. మిగతా అడ్డాకుల, భూత్పూర్, ముసాపేట మండలాలకు మాత్రం కర్వెనా రిజర్వాయర్ నుండి మరో రెండేళ్లలోపు సాగునీరు అందించి తీరుతామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య తెలంగాణగా ఉండాలనే సంకల్పంతో ప్రజల ఆరోగ్య భద్రత కోసం సీఎం రిలీఫ్‌ఫండ్ నుండి లక్షల రూపాయలను అందజేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మాధవి, కొండన్న, వేణుగోపాల్‌రెడ్డి, చెన్నమ్మ, ఖాజాపాష, రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.