మహబూబ్‌నగర్

వైభవంగా సీతారాముల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, డిసెంబర్ 17: అన్ని దానములకన్న కన్యాదానం ఎంతో ఉత్కృష్టమైనదని, కన్యాధానం చేసిన వారు లక్ష గోవులను ధానం చేసినంత పుణ్యం వస్తుందని, 21 తరాల వంశీయులకు మోక్షం లభిస్తుందని వేధ పండితులు, సుంధరకాండ ప్రవచన కర్త శ్రీనివాసస్వామీజీ అన్నారు. ఆదివారం మక్తల్ పట్టణంలోగల శ్రీపడమటి ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలోగల రామలీల మైదానంలో ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, ఆయన సతీమణి చిట్టెం సుచరితరెడ్డిల ఆధ్వర్యంలో ‘సీతారాముల కళ్యాణోత్సవం’ కార్యక్రమం కనుల పండువగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే చిట్టెం దంపతులు శ్రీపడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాముల విగ్రహాలను కళ్యాణ మండపం వద్దకు వేదతాళాల మధ్య, పండితుల వేదమంత్రంలతో తీసుకొచ్చారు. సుందరకాండ పారాయణ ప్రవచనకర్త పి.శ్రీనివాస్‌స్వామీజీ, వేద పండితుల మధ్య రాములోరి కళ్యాణం కమనీయంగా సాగింది. ఈ సందర్భబంగా ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి ఆయన సతీమణి చిట్టెం సుచరితరెడ్డిలు, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి దంపతులు రాములోరికి ముత్యాల తలంభ్రాలతో కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. స్వామీజీలు మాట్లాడుతూ సీతారాముల కళ్యాణానికి మిమ్మందరిని ఇక్కడి రప్పించడానికి యజ్ఞ సాధకులుగా మిగిలారు ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి దంపతులని అన్నారు. కన్యాధానం చేసిన వారు భాగుండాలి, మన ఆడపిల్ల ఇచ్చిన ఇల్లూ భాగుండాలని కోరుకోవాలన్నారు. భగవంతుడు అన్నవాడు ఎక్కడో లేడు మనం మాట్లాడే మాటల్లో ఉన్నాడు, దృష్టిలో ఉన్నాడు, మట్లాడే , వినిపించే శక్తిలో ఉన్నాడని అన్నారు. ఎన్ని యాగాలు చేసిన మహా కృతులన్ని ఒక్క కన్యాధానంలో ఉంటాయని తెలిపారు. భగవంతుని దగ్గరకు వెళ్లాలంటే మధ్యలో 7లోకాలు ఉంటాయని, అట్టి ద్వారాలు తెరుచుకోవాలంటే సత్కర్మలు, పుణ్యపు పనులు చేసినప్పుడే తెరుచుకుంటాయని అన్నారు. ఏ ఇంట్లో ఆడపిల్ల ఉండి కన్యాధానం చేస్తారో ఆవంశికులు 21 తరాలుగా మోక్షప్రదాయులు అవుతారని స్వామీజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం దంపతులతోపాటు వారి సుపుత్రుడైన చిట్టెం చాణిక్యరెడ్డి దంపతులు, నారాయపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి దంపతులు, మార్కెట్ చైర్మన్ పి.నర్సింహగౌడ్, వెంకట్‌రామారెడ్డి, మాజీ ఎంపిపి చంద్రకాంత్‌గౌడ్, సర్పంచ్ భాగ్యమ్మ, కొండయ్య, ఎంపిటిసిలు రవిశంకర్‌రెడ్డి, కావలి జయశ్రీశ్రీహరి, గడ్డంపల్లి హన్మంతు, అనుగొండ సర్పంచ్ కొత్తకాపు గోవర్ధన్‌రెడ్డి, కోళ్లవెంకటేష్, మహిపాల్‌రెడ్డి, రహీంపటేల్, నర్సింహరెడ్డి, నాగిరెడ్డి, రాజమహేందర్‌రెడ్డి, గోవింద్‌రావు, రాజేష్‌గౌడ్, రాజశేఖర్‌రెడ్డి, అమర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.