మహబూబ్‌నగర్

క్రీడల అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, డిసెంబర్ 17: ప్రతి ఒక్కరూ వృత్తి రంగాలలో రాణించుకుంటూ కొంత సమయాన్ని సేవారంగానికి కేటాయించాలని మాజీ మంత్రి వర్యులు, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ సూచించారు. ఆదివారం ఇందిరాగాంధీ శతజయంతి వేడుకలు పురష్కరించుకుని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించు రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ క్రికెట్ పోటీలు ఆదివారం జిల్లా కేంద్రంలోని గద్వాల తేరుమైదానంలో ప్రారంభమయ్యాయి. ముందుగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నడిగడ్డలోని అన్ని క్రీడల అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని గుర్తు చేశారు. ఇందులో భాగంగా గతంలో ఫుట్‌బాల్, కబడ్డీ టోర్నమెంట్లను నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ ప్రాంత క్రీడాకారులు ఇప్పటికే కబడ్డీ, ఫుట్‌బాల్‌లో జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారని, వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింతగా రాణించాలని సూచించారు. గద్వాల క్రికెట్ అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తి మేరకు రాష్టస్థ్రాయి పోటీలను నిర్వహించేందుకు ముందుకు వచ్చామని గుర్తు చేశారు. ఈ పోటీల్లో గెలుపొందిన మొదటి విజేతకు రూ.లక్ష నగదు ప్రోత్సాహక బహుమతిని ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ క్రీడాపోటీలకు ఉత్తర తెలంగాణ తెలుగు సమితి(నాటా) సభ్యులు సైతం హాజరై తమ అభినందనలు తెలియజేశారు. ఈప్రాంతానికి చెందిన మురారీ వెంకటరమణారెడ్డి, మురారీ మల్లికార్జున్‌రెడ్డిల అభీష్టం మేరకు గద్వాల క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని సూచించారు.