మహబూబ్‌నగర్

నల్లమలలో ప్రతిధ్వనించిన ఓంకారనాధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగాల, ఏప్రిల్ 20: మండల పరిధిలోని నల్లమల అడవుల్లోని లోతట్టు కొండ లోయల్లో సలేశ్వర క్షేత్రంలో వెలసిన లింగమయ్య బ్రహ్మోత్సవాలకు ప్రజలు తండోపతండాలుగా తరలివెళ్ళుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహరాష్ట్ర, కర్నాటకకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ మొక్కుబడులను చెల్లించుకుంటుండడంతో నల్లమల అడవంతా జనసందోహంతో నిండిపోయింది. ఎతె్తైన కొండలు ఎక్కుతూ, లోతైన లోయలు దిగుతూ చెంచుల పూజలు అందుకుంటున్న లింగమయ్యను దర్శించుకోవడానికి భక్తులు ఓంకార నాధాలతో అడవి ప్రతిధ్వనిస్తున్నది. వస్తున్న లింగమయ్య అంటూ కొందరు, వెళ్ళుతున్నాం లింగమయ్య అంటూ కొందరు, ఓం శివాయా అంటూ మరికొందరు భక్తులు చేస్తున్న నినాదాలతో అడవి దద్దరిల్లిపోతున్నది. మండుటెండలో కాలినడకన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ నడకను సాగిస్తున్న భక్తులు లోయలోని సన్నిధానం దగ్గర ఎతైనకొండ నుంచి కిందికి జారుతున్న జలపాతం చల్లదనం భక్తుల అలసట తీర్చుతున్నది. చైత్రపౌర్ణమి సందర్భంగా గురు, శుక్రవారాలలో భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లను చేసినట్లు దేవాలయ కమిటీ అధ్యక్షుడు నిమ్మల గురువయ్య తెలిపారు. కాగా లింగాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి నిర్వహించే విమాన రథోత్సవాన్ని తిలకించి కాలినడకన అప్పాయిపల్లి నుంచి అధిక సంఖ్యలో సలేశ్వరానికి తరలి వెళ్ళుతుండడంతో శ్రీ కోదండరామస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతున్నది.