మహబూబ్‌నగర్

పంచాయతీ ఎన్నికలు ప్రత్యక్షంగానే జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 23: గ్రామపంచాయతీ ఎన్నికలపై నూతన ముసాయిదాను రూపొందిస్తున్న తరుణంలో గ్రామపంచాయతీ వ్యవస్థలో పలుమార్పులు చేస్తున్న తరుణంలో వాటిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో మంగళవారం ప్రతి గ్రామపంచాయతీ ఎదుట కాంగ్రెస్ పార్టీ గ్రామకమిటీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయా గ్రామపంచాయతీల కార్యదర్శులకు వినతిపత్రాలను అందజేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్న విధానంలో భాగంగా గ్రామపంచాయతీలకు పరోక్ష ఎన్నికలను నిర్వహించి ఈ ప్రక్రియ ద్వారా సర్పంచులను ఎన్నుకోవాలనే విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు, పంచాయతీ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపి వినతిపత్రాన్ని అందజేశారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బొక్కలోనిపల్లి, ఒబులయపల్లి, పోతన్‌పల్లి, హన్వాడ గ్రామాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, డీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్‌ముదిరాజ్, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరుణాకర్‌గౌడ్, నరసింహారెడ్డిలు వివిధ గ్రామాల కార్యదర్శులకు వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రశాంతవాతావరణాన్ని చెడగొట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గ్రామపంచాయతీలకు ప్రత్యక్ష ఎన్నికలే శ్రేయస్కరమని ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్ష ఎన్నికల పద్ధతి విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామగ్రామాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. దివంగత ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ 72వ రాజ్యాంగ సవరణతో గ్రామపంచాయతీలకు ఎన్నో అధికారాలను కట్టబెట్టారని దాంతో గ్రామపంచాయతీ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రత్యక్ష ఎన్నికలే మంచిదని నిజాయితీగల రాజకీయ నాయకులను ప్రజలకు సేవచేసే వ్యక్తులకు సర్పంచులు, వార్డు మెంబర్లుగా గెలిచే అవకాశం ఉంటుందని తెలిపారు. పరోక్ష ఎన్నికల ద్వారా సర్పంచులను నియమిస్తే అవినీతి రాజ్యమేలుతుందని డబ్బు ఉన్నవాళ్లే సర్పంచులుగా అయ్యే అవకాశం ఉంటుందని సేవచేసేవారికి అవకాశం చేజారిపోతుందని అన్నారు. వీటన్నింటిని ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టుకోకుండా గ్రామపంచాయతీ వ్యవస్థను అవినీతిమయం చేసేందుకు పునుకున్నారని ఆరోపించారు. పరోక్ష ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని తెలిపారు.

మరుగుదొడ్ల నిర్మాణంలో భైరాపురం జిల్లాకే గర్వకారణం
* 3నెలల్లో 65వేల మరుగుదొడ్ల నిర్మాణం * జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ
మానవపాడు, జనవరి 23: సంపూర్ణ మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టిన భైరాపురం గ్రామం జిల్లాకే గర్వకారణంగా నిలిచిందని కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ అన్నారు. మంగళవారం ఉండవెల్లి మండల పరిధిలో విఎస్‌టి, గ్రామాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన మరుగుదొడ్లను కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ సైనీ మాట్లాడుతూ జిల్లాలో మూడు నెలల్లో 65వేల మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. జిల్లాలోని గట్టు, కేటిదొడ్డి, అయిజ మండలాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయన్నారు. గ్రామాలలో డంపింగ్ యార్డులు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణాలకు ఇసుక సమస్య లేదని రూ.12వేల బిల్లులు సైతం వెంటనే చెల్లిస్తున్నట్లు వివరించారు. మండల ప్రత్యేకాధికారి, జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీత మాట్లాడుతూ ఆరుబయట మలవిసర్జనతో రోగాలు ప్రబలుతాయని వివరించారు. వీఎస్‌టీ ఏజీఎం జయచంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 3వేల మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు యోగా, చిత్రలేఖనంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామాలయ సంస్థ ఈడీ ఎలంగోవన్, ఎంపీడీఓ మల్లికార్జున, తహశీల్దార్ మదన్‌మోహన్, సర్పంచ్ వౌనిక, ఎంపీటీసీ లక్ష్మమ్మ పాల్గొన్నారు.