మహబూబ్‌నగర్

మరో 20ఏళ్లు టీఆర్‌ఎస్‌దే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, జనవరి 23: రాష్ట్రంలో మరో 20 ఏళ్లు టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జోస్యం చెప్పారు. ప్రతిపక్ష నాయకులు 2019 ఎన్నికల్లో గెలుస్తామని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం కల్వకుర్తి పట్టణ సమీపంలో గల ఈదుల చెరువులో చేపలను వదలడంతో పాటు మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మంత్రి జూపల్లి ప్రారంభించారు. మొదటగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను బాలాజీసింగ్‌తో కలిసి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బాధితులకు అందజేశారు. అనంతరం ఈదుల చెరువు వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారన్నారు. అందులో భాగంగానే అడపిల్లల పెళ్లికి రూ.75,116, గర్భిణీలకు రూ.12వేలతో పాటు కేసీఆర్ కిట్‌ను అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే విద్యార్థుల కోసం 500 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్‌తో మండల జనాభాను దృష్టిలో పెట్టుకుని 2నుండి 4వరకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని, ఫిబ్రవరి నెల చివరి నాటికి కల్వకుర్తిలో ఇంటింటికి తాగునీరు అందిస్తామని ఆయన ప్రకటించారు. గత 70 సంవత్సరాలలో జరగని అభివృద్ధిని మూడున్నర సంవత్సరాలలో చేశామని మంత్రి జూపల్లి గుర్తుచేశారు. మిషన్ భగీరథ పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. భగీరథ కోసం లక్షా 50వేల కిలో మీటర్ల మేర పైప్‌లైన్ చేయడమనేది ప్రపంచ రికార్డు అని మంత్రి జూపల్లి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్, విద్య, వైద్య, పరిశ్రమ రంగాలలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ శ్రీశైలం, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ విజితారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.