మహబూబ్‌నగర్

జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అనితారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 23: మహిళా కాంగ్రెస్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షురాలిగా బెక్కరి అనితారెడ్డిని నియమిస్తూ మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ నియమాక పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా మాజీ కౌన్సిలర్ సుస్మితను నియమించారు. ఈ సందర్భంగా అనితారెడ్డి, సుస్మితలను మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లతో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న పద్మజాయాదవ్ టీఆర్‌ఎస్ పార్టీ మారినంతమాత్రన జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. నూతనంగా మహబూబ్‌నగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బెక్కరి అనితారెడ్డిని నియమించామని అదేవిధంగా మహబూబ్‌నగర్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా టీడీగుట్ట ప్రాంతానికి చెందిన మాజీ కౌన్సిలర్ సుస్మితను నియమించామన్నారు. వీరి ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ గ్రామగ్రామాన బలోపేతం కానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నూతనంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితురాలైన బెక్కరి అనితారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీ కోసం నిరంతరంగా పనిచేస్తానన్నారు. మహిళలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడంలో గ్రామగ్రామాన మహిళా కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేస్తానని ఆమె వెల్లడించారు. మండల స్థాయిలో మహిళలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళా సంఘాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వడ్డీలేని రుణాల ఊసేలేకుండా చేసిందని మహిళలను చైతన్యంచేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. తనకు ఈ పదవిని ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలందరికి జిల్లా కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాళ్లు చంద్రకళరెడ్డి, నాయకులు అనంతరెడ్డి, లక్ష్మణ్‌యాదవ్, బెనహర్, చంద్రకుమార్‌గౌడ్, సంజీవ్‌ముదిరాజ్, జహీర్ అక్తర్, శేఖర్‌నాయక్, కట్ట రవికిషన్‌రెడ్డి, అంజనేయులు, శ్రీను, గోనేల విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.