మహబూబ్‌నగర్

సంక్షేమ రంగానికి అత్యధిక నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలానగర్, జనవరి 23: ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ రంగానికి అత్యధిక నిధులు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం బాలానగర్ మండల కేంద్రంలో కార్యకర్తల బహిరంగ సమావేశంలో ప్రసంగించారు. ఈ ఏడాది సంక్షేమ రంగానికి రూ.40వేల కోట్లను ఖర్చు చేయడం జరిగిందన్నారు. గతంలో పాలకులు సంక్షేమానికి ఏ ప్రభుత్వం ఇన్ని నిధులు కేటాయించలేదన్నారు. రైతుల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయిస్తుందన్నారు. ఇందులో భాగంగా రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నట్లు ఆయన వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి ఏ ప్రభుత్వం చేయని సాహసం కేసీఆర్ ప్రభుత్వం చేసిందన్నారు. భూరికార్డుల ప్రక్షాళన ఎకరాకు రెండు పంటలకు కలిపి రూ.8వేలు వ్యవసాయ పెట్టుబడుల కోసం ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కల్యాణలక్ష్మీ పథకానికి రూ.లక్ష ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు శుద్ధజలాలు అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇంటింటికి నల్లాల ద్వారా శుద్ధజలాన్ని అందించనున్నట్లు చెప్పారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఉమ్మడి జిల్లా రైతాంగానికి లక్ష 50వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు వెల్లడించారు. ప్రజలను ఆరోగ్యంగా ఉంచాలని సంకల్పంతో గర్భిణులకు కేసీఆర్ కిట్లు అందించడం జరిగిందన్నారు. అలాగే బాలానగర్‌లో 30 పడకల ఆసుపత్రి పూర్తి కావచ్చిందని, జడ్చర్లలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పనులు త్వరలో ప్రారంభంకానున్నట్లు మంత్రి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీల్లో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భాగ్యమ్మ, జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ లింగునాయక్, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, మాజి మార్కెట్ చైర్మన్ రమేష్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ శ్రీశైలంయాదవ్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, నరసింహులు, లక్ష్మణ్‌నాయక్, కొదండరాంరెడ్డి, వెంకట్‌రెడ్డి, వివిధ మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.