మహబూబ్‌నగర్

2019 ఎన్నికల్లో అధికారం మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, మార్చి 19: రాబోయే 2019 ఎన్నికలలో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలో నూతనంగా పట్టణ, మండల పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ జెండా పేదలకు అండ అని, రాహుల్‌గాంధీ సారధ్యంలో పార్టీకి యువజనోత్సవం నింపేందుకు ప్రతి ఒక కార్యకర్త అందుకనుగుణంగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి 125 ఏండ్ల ఘన చరిత్ర ఉందని, కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి పేదోడికి అండ అని ఎమ్మెల్యే గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనే పునాదులపై నిర్మింపబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్లీనరీలో జరిగిన అంశాలను కార్యకర్తలకు వివరించారు. కేంద్రంలో, రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని అందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ఈకార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జగన్, మండల, పట్టణ అధ్యక్షులు పవన్‌కుమార్‌రెడ్డి, శ్రీరాములుగౌడ్, మైనారిటీ నాయకులు షాకీర్, యువజన అధ్యక్షులు రాహుల్, శేఖర్ ఉన్నారు.

వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలి
- కలెక్టర్ శే్వతామహంతి
వనపర్తి, మార్చి19: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అనాథ శరణాలయంతో పాటు వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ శే్వతామహంతి అన్నారు. సోమవారం కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్‌ను కలిసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ నూతన కమిటీ సభ్యులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. కొత్త కమిటీ, అనాథ శరణాలయం ఏర్పాటు, వృద్ధాశ్రమం, సీనియర్ సిటిజన్స్ హోం ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఇందుకు అవసరమైతే తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా నూతనంగా ఏర్పాటైనా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈసందర్బంగా రెడ్‌క్రాస్ ద్వారా చేపట్టే కార్యక్రమాలను కలెక్టర్ వారితో చర్చించారు. వనపర్తి జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రెగ్యులర్ కమిటీ చైర్మన్‌గా ఖాజకుత్బుద్దిన్, వైస్ చైర్మన్‌గా అమర్, ప్రధాన కార్యదర్శిగా పోచా రవీందర్‌రెడ్డి, ట్రెజరర్‌గా భగవంతురెడ్డి, సభ్యులుగా డాక్టర్ ఎల్. మురళీధర్, డాక్టర్ రమేష్‌బాబు, చిన్నమ్మథామస్, కలాం పాష, రాఘవేందర్‌రెడ్డి, మిసేక్‌లతో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే రెడ్‌క్రాస్ సప్త సూత్రాలను పాటించాలని ఆమె వారికి సూచించారు.

ప్రతి ఇంట ఉండాల్సిన పుస్తకం
* తీయనైన తెలుగు-తెలంగాణ వెలుగు
* జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్
నాగర్‌కర్నూల్, మార్చి 19: రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రచురించిన తీయనైన తెలుగు-తెలంగాణ వెలుగు అనే పుస్తకం ప్రతి ఇంట ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఈ. శ్రీ్ధర్ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన అధికారులతో కలిసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వివిధ అంశాలతో రూపొందించిన ఈ పుస్తకాన్ని జిల్లాలోని అన్ని గ్రామాలలో ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. 64పేజీలు గల ఈ పుస్తకంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు వర్ణమాల, తిథులు, వారాలు, పక్షాలు, నక్షత్రాలు తదితర విషయాలు పొందుపరిచి ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో మరిచిపోయిన అనేక విషయాలను ఈ పుస్తకంలో పొందుపరిచారని ఎంతో విలువైన ఈ పుస్తకాన్ని ప్రతి ఇంట ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆంగ్ల భాష మీద పెంచుకున్న మోజుతో అసలైన తెలంగాణ భాషను మరిచిపోతున్న తరుణంలో ఇలాంటి పుస్తకం రావడం హర్షనీయమన్నారు. కార్యక్రమంలో అధికారులు రాంమోహన్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.