మహబూబ్‌నగర్

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దకొత్తపల్లి, మార్చి 19: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పెద్దపీట వేసిందని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం వెన్నచర్ల గ్రామంలో రైతు సంబరాలలో భాగంగా అంతరాష్ట్ర బండలాగుడు పోటీలను ఆ గ్రామ సర్పంచ్ సూర్యప్రతాప్‌గౌడ్ ప్రారంభించారు. బండలాగుడు పోటీలలో గెలుపొందిన వృషభరాజుల యాజమానులకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి అనంతపురం జిల్లాకు చెందిన ఓబుల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డిలకు చెందిన వృషభరాజులు 5781 ఫీట్లు లాగి రూ. 50వేల నగదుతో పాటు షీల్డును అందుకున్నారు. రెండవ బహుమతి కర్నూలు జిల్లాకు చెందిన గుండం చెన్నారెడ్డి వృషభరాజులు 5591్ఫట్లు లాగి రూ. 40వేల నగదు షీల్డును , మూడవ బహుమతి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన చంద్రశేఖర్ వృషభరాజులు 5414్ఫట్లు లాగి రూ. 30వేల నగదుతో పాటు షీల్డు, నాల్గవ బహుమతి కర్నూలు జిల్లాకు గుండం చెన్నారెడ్డి 5131్ఫట్లు లాగి రూ. 20వేల నగదుతో పాటు షీల్డు, ఐదవ బహుమతి వనపర్తి జిల్లా పరుశరాముడు వృషభరాజులు 5100్ఫట్లు లాగి రూ. 10వేల నగదుతో పాటు షీల్డు, ఆరవ బహుమతి నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన నర్లాపూర్‌కు చెందిన సత్యనారాయణ వృషభరాజులు 4068్ఫట్లు లాగి రూ. 5వేల నగదుతో పాటు షీల్డులను మంత్రి జూపల్లి కృష్ణారావు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాగునీటికి, సాగునీటికి, విద్యుత్ సరఫరాకు, పండించిన పంటకు గిట్టుబాటు ధర అందించేందుకే రైతులకు పెద్దపీట వేసి అన్ని విధాలుగా ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రైతుల ముఖాలలో ఆనందం వెల్లివెత్తినప్పుడు రాష్ట్ర సుభిక్షంగా ఉంటుందన్నారు. బండలాగుడు పోటీలను మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆనందంగా జరుపుకునేందకు రైతులంతా వృషభరాజులను పోషించాలని మంత్రి జూపల్లి అన్నారు. ఏప్రిల్ 25నుండి మే19 వరకు రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ. 4వేల చెక్కులను పంట పెట్టుబడికి అందజేస్తుందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేనపుడు ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకోసం గోదాములను ఏర్పాటు చేసిందన్నారు. ఆ పంటకు బ్యాంకు అధికారులు నగదు రూపంలో అందించి గిట్టుబాటు ధర వచ్చాకా రైతు బ్యాంకు అప్పు తీర్చుకుంటారన్నారు. గ్రామాలలో సీసీ రోడ్లను ఈ నెల చివరిలోగా పూర్తి చేయాలని ఆయా గ్రామ సర్పంచులకు, ఎంసీటీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ ఉప సర్పంచ్ పర్వతాలు, సింగిల్ విండో చైర్మన్ బాలస్వామి, ఎంపీటీసీ మంజూల, సింగిల్ విండో సభ్యులు కర్ణ యాదవ్, ఎంపీపీ వెంకటేశ్వర్‌రావు, జడ్పీటీసీ వెంకటయ్య, టీఆర్‌ఎస్ పార్టీ మంలాధ్యక్షులు విష్ణు, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.