మహబూబ్‌నగర్

బాల్య వివాహాలు అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, మార్చి 20: బాల్యవివాహాలు అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ అన్నారు. స్ర్తి శిశు సంక్షేమ శాఖ, ఎంవీఎఫ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బాలభవన్‌లో వివాహ నమోదు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సైనీ మాట్లాడుతూ నడిగడ్డ ప్రాంతం అక్షరాస్యతలో వెనుకబడి ఉందని, దీని వల్ల పిల్లలను బడికి మాన్పించి పిన్న వయస్సులోనే బాల్యవివాహాలు చేయడం వల్ల వారి జీవితాన్ని చిదిమివేసిన వాళ్లమవుతామన్నారు. బాలలను పనికి పంపించకుండా బడికి పంపి అక్షరాస్యత పెంపొందించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో జిల్లాలో 300 పైగా బాల్యవివాహాలు అరికట్టినట్లు, జిల్లా అధికారులు బాల్యవివాహాలు అరికట్టడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారన్నారు. దీనికి ప్రజల నుంచి కూడా సహకారం లభిస్తే బాల్యవివాహాలు పూర్తిస్థాయిలో నిర్మూలించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బాల్యవివాహాలు అరికట్టడానికి గ్రామాల నుంచే వివాహ నమోదులు తప్పని సరిగా చేయాలని, దీనికి ప్రతి ఒక్కరు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులు, సర్పంచులు, అంగన్‌వాడీ టీచర్లు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామాధికారులు బాల్యవివాహాలపై దృష్టిసారించి, వాటికి అడ్డుకట్ట వేయాలని సూచించారు. ఆయా గ్రామాల్లో బాల్యవివాహాలకు ఎవరికైనా పాల్పడితే సంబంధిత అధికారులపై, తల్లిదండ్రులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతతోపాటు, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ భాస్కర్, సీఐ వెంకటేశ్వర్లు, డిడబ్ల్యూఓ అధికారిణి అరుణ, ఎంవీఎఫ్ ఫౌండేషన్ నిర్వాహకులు, తహశీల్దార్‌లు, ఎంపీడీఓలు, సర్పంచులు, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పకడ్బందీగా ఆధార్ నమోదు చేయాలి
* ఆధార్ నమోదులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
* నారాయణపేట సబ్ కలెక్టర్ కృష్ణ ఆదిత్య
మక్తల్, మార్చి 20: భూ ప్రక్షాళనలో భాగంగా ఆధార్ నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని సబ్ కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. ఆధార్ నమోదులో అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం మక్తల్ తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా రైతుల ఖాతా నెంబర్లకు ఆధార్ నమోదు తప్పనిసరిగా చేయాలన్నారు. ఆధార్ నమోదు విషయంలో సిబ్బంది అలసత్వం వహించకుండా యుద్ధప్రాతిపదికన వందశాంతం పూర్తి చేయాలని ఆదేశించారు. మక్తల్ మండలంలోని కర్ని గ్రామంలో భూ వివరాలకు సంబంధించిన ఆధార్‌నమోదును పకడ్బందీగా నిర్వహించి వివరాలను వెంటనే పొందుపరచాలని తహశీల్దార్ వరప్రసాద్‌ను ఆదేశించారు. మక్తల్, మాగనూర్, కృష్ణ మండలాల్లో ఆధార్ నమోదు 80 శాతం పూర్తయిందని ఆయన వివరించారు. రైతుల ఖాతాల్లో ఏదైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే వాటిని పరిష్కరించి ఆధార్ నమోదును పూర్తి చేయాలన్నారు. సాదాబైనామా, ఓపిటి, ప్రభుత్వ భూముల అమ్మకాలను త్వరితగతిన పరిశీలించి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ తహశీల్దార్‌కు సూచించారు. గతంలో పేదలకు ఇచ్చిన అసైన్ భూములు వాటి వివరాలను సేకరించి అసైన్ కల్గిన వ్యక్తి స్థితిగతులను పరిశీలించి 5 ఎకరాల భూమి ఉంటే వారికే తిరిగి అసైన్ చేయాలని సూచించారు. అంతకు ఎక్కువ భూమి ఉంటే సదరు వ్యక్తి నుండి ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకంటుందని సబ్ కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఏమైన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో తహశీల్దార్‌లు వరప్రసాద్, రాజీవ్‌రెడ్డి, మక్తల్ ఎలక్షన్ డీటీ సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.