మహబూబ్‌నగర్

పార్టీ మార్పుపై నాగం అభిప్రాయ సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, మార్చి 21: సాధారణ ఎన్నికల కొలాహాలం ప్రారంభం కాకముందే నాగర్‌కర్నూల్ శాసనసభ నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజి మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి బీజేపీలో తగిన ప్రాధాన్యతను ఇవ్వడంలేదని, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, కార్యకర్తల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకుంటానని ప్రకటించినప్పటి నుంచే నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ కార్యకలాపాలు జోరందుకున్నాయని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న జైపాల్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్న నాగం జనార్ధన్‌రెడ్డి ఆయనతోపాటు మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు తీసుకొచ్చిన ఒత్తిడి మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నాగం జనార్ధన్‌రెడ్డి రంగాన్ని సిద్దం చేసుకున్నారు. గత 25ఏళ్ల నుంచి నాగంతో రాజకీయంగా విభేదిస్తూ ఆయనతో ఢీ అంటే ఢీ అనే రీతిలో రాజకీయాలను కొనసాగిస్తూ వస్తున్న ఎమ్మెల్సీ, నాగర్‌కర్నూల్ శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మాత్రం నాగం కాంగ్రెస్‌లో చేరితే సహకరించబోనని, ఆయనతో కాంగ్రెస్ పార్టీకి లాభంకంటే నష్టమే అధికమని, నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలంతా ఆయన చేరికను ఒప్పుకోవడంలేదని పార్టీ అధిష్ఠానానికి వివరించడంతోపాటు ఎంపీ నంది ఎల్లయ్య, మాజీ మంత్రి డీకే అరుణతో కలిసి ఎఐసీసీ అధ్యక్షుడు రాహూల్‌గాంధీకి వివరించి నాగంను పార్టీలో చేర్చుకోవద్దని కోరారు. ఒకవేళ పార్టీలో చేర్చుకున్న అభ్యంతరంలేదని, కాని నాగర్‌కర్నూల్ శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ బీఫాం మాత్రం ఇవ్వవద్దని కోరినట్లు తెలుస్తున్నది. రాష్టస్థ్రాయి కాంగ్రెస్ నేతలతోను ఇదే విషయంపై ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాగంకు టికెట్ ఇస్తే సహకరించేదిలేదని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టంగా చెప్పిన్నట్లు ఆయన అనుచరులు అంటున్నారు. అయతే మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితోపాటు పీసీసీ, ఎఐసీసీలోని కొంతమంది నాయకులు కాంగ్రెస్‌లో చేరాలని నాగంపై ఒత్తిడి తెస్తుండటంతో గత నాలుగైదు రోజుల నుంచి నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని నాగం అనుచరులతో మండలాల వారిగా కార్యకర్తల అభిప్రాయం తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలకపల్లి, తిమ్మాజిపేట, తాడూరు, నాగర్‌కర్నూల్ టౌన్ కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న నాగం గురువారం బిజినేపల్లి, నాగర్‌కర్నూల్ మండలాలకు చెందిన కార్యకర్తలతో సమావేశమై పార్టీ మార్పుపై స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు నాగం అనుచరులు తెలిపారు. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ ప్లీనరీ సమావేశం ముగిసినందున సాధ్యమైనంత తొందరగా పార్టీలో చేరాలని ఏఐసీసీ నుంచి కొంతమంది నేతలు నాగంపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి సైతం నాగం చేరికపై తీవ్రమైన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పార్టీ అగ్రనేతలతో సమావేశమవుతున్నట్లు సమాచారం. నాగం పార్టీ మార్పుపైనే నియోజకవర్గంలో జోరుగా చర్చ కొనసాగుతున్నది. మొత్తంమీద నియోజకవర్గంలో రాజకీయ వేడి పుంజుకుందని చెప్పవచ్చు.

2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తాం
* డీసీసీబీ చైర్మన్ కె.వీరారెడ్డి
ధన్వాడ, మార్చి 21: 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తామని డీసీసీబీ చైర్మన్ కె.వీరారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మరికల్‌లో స్థానిక విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకంపోయిందన్నారు. నేడు గ్రామాలలో భూ సర్వేల పేర్లతో రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న రైతులకు పూర్తిస్తాయిలో సాగునీరును అందించలేకపోవడం సిగ్గుచేటన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ భూస్థాపితం ఖావడం ఖాయమన్నారు. అంతకు ముందు మరికల్ మండల పరిధిలోని తీలేర్ స్టేజి వద్ద బుధవారం ఆర్టీసీ బస్‌సేంటర్ వద్ద కోల్లుకుదురు వెంకారెడ్డి, వజ్రమ్మల జ్ఞాపకార్థంతో అంజలి కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ కె.వీరారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈసమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రదీప్‌కుమార్‌గౌడ్, నాయకులు ప్రశాంత్‌రెడ్డి, తిమ్మరెడ్డి, బాలకిష్టయ్యగౌడ్, వెంకటేష్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.