మహబూబ్‌నగర్

మరుగుదొడ్లు, అక్షరాస్యతలో జిల్లా చివరి స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవపాడు, మార్చి 22: మరుగుదొడ్లు, అక్షరాస్యతల్లో రాష్ట్రంలో జోగుళాంబ గద్వాల జిల్లా చివరి స్థానంలో నిలిచిందని, వాటికి కారణాలు అనేకమున్నా మార్పు రావాలని గద్వాల కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ అన్నారు. గురువారం మండల పరిధిలోని పల్లెపాడులో రూ.35 లక్షలతో చేపట్టి సీసీ రోడ్డు పనులు, బోరవెల్లిలో రూ.35 లక్షలతో చేపట్టిన ఏడు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కలెక్టర్ భూమి పూజలు చేశారు. అనంతరం మండల పరిధిలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకొన్న చిన్న పోతులపాడు, పెద్దపోతులపాడు గ్రామాలను సందర్శించి ఆరు బయట మల విసర్జన లేని గ్రామాలుగా ప్రకటించారు. ఈ సందర్భంగా చిన్న పోతులపాడులో గ్రామ సర్పంచు రాజశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ వీఎస్‌టీ, గ్రామాలయ సారథ్యంలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవటం శుభపరిణామమని ఇది శుభదినం అన్నారు. 200 పంచాయతీల పరిధిలో 1.20 లక్షల ఇళ్లులు ఉండగా 90వేల ఇళ్లలో మరుగుదొడ్లు లేవని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలంపూర్ తాలూకాలో 40 శాతం మరుగుదొడ్లు ఉండగా మల్దకల్, గట్టు ప్రాంతాలలో మరుగుదొడ్లు లేవని వివరించారు. మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రజలు బిల్లులు రాలేదని ఫిర్యాదు చేస్తున్నారు కానీ మరుగుదొడ్ల అవసరాన్ని గుర్తించటం లేదన్నారు. ఆరు బయట మల విసర్జన చేయటం వల్ల రోగాలతో గ్రామాలు మంచానపడ్తాయన్నారు. గ్రామ పంచాయతీ నిధులను మరుగు దొడ్లకు వినియోగించుకోవాలని సూచించారు. చదువుతోనే మార్పు సాధ్యమన్నారు. ప్రభుత్వం పాఠశాల, ఉపాధ్యాయులను ఏర్పాటు చేస్తుంది కానీ తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపించకపోతే ప్రభుత్వ పథకాలు నీరుగారుతాయన్నారు. అలంపూర్ తాలూకా టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి మంద శ్రీనాధ్ మాట్లాడుతూ ఆరు బయట మలవిసర్జనపై ఈగలు దోమలు వాలి తినుబండారాలపై వాలటం వల్ల జబ్బులు కొనితెస్తాయని వివరించారు. అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పటేల్ విష్ణువర్దన్‌రెడ్డి మాట్లాడుతూ సేవా భావంతో స్వచ్ఛ సమాజాన్ని నిర్మించుకోవచ్చన్నారు. వీఎస్‌టీ జయచంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామాలయ సంస్థ పర్యవేక్షణలో ఇరు గ్రామాలలో 613 మరుగుదొడ్లు నిర్మించామని, 44 సోలార్ విద్యుత్ వీధిదీపాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ, తహశీల్దార్ మునెప్ప, ఎంపీడీఓ ముషాయిదా బేగం, జాతీయ సస్టేనబుల్ వాటర్, సానిటేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ అమృత, పెద్దపోతులపాడు సర్పంచు తిమ్మక్క, తదితరులు పాల్గొన్నారు.