క్రైమ్/లీగల్

కానిస్టేబుల్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 23: మహబూబ్‌నగర్ పట్టణంలోని శివశక్తినగర్‌లో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ రవి(27) ఉరివేసుకుని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుశాఖలో ఫింగర్‌ప్రింట్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న రవి ఆత్మహత్య చేసుకోవడం జిల్లా పోలీసుల్లో కలకలం రేపింది. అయితే రవి భార్య రంజిత గురువారం ఆత్మహత్య చేసుకోగా రవి శుక్రవారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక్కరోజు వ్యవధిలోనే భార్యభర్తలు ఇద్దరు ఆత్మహత్యలు చేసుకుని మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మహబూబ్‌నగర్ ఎస్పీ అనురాధ కానిస్టేబుల్ రవి మృతదేహన్ని పరిశీలించి నివాళ్లు అర్పించి వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి రవి మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు.

రోడ్డు నిబంధనలు పాటించని వాహనాలకు రూ. 2కోట్లు జరిమానా
- ఆర్టీవో స్వామి
మన్ననూరు, మార్చి 23: జిల్లాలో రోడ్డు నిబంధనలు పాటించని వాహనదారులకు 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.2కోట్ల ఆపరాధ రుసుం విధించినట్లు ఆర్టీవో స్వామి తెలిపారు. శుక్రవారం మన్ననూరులోని ఈగల పెంట పోలీస్ స్టేషన్‌లో 29వ జాతీయ రహదారి భద్రతావారోత్సవాలలో భాగంగా వాహన డ్రైవర్లకు తగు సూచనలు ఇచ్చారు. తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాల ఇన్స్యూరెన్స్, డ్రైవర్‌కు లైసెన్స్ ఉండాలని, మద్యం తాగి వాహనాలు నడుపరాదని సూచించారు. జిల్లాలో వాహనదారులకు విధించిన రూ. 2కోట్ల ఆపరాధ రుసుంలో 45శాతం వసూలు కావాల్సివుందని పోలీస్‌ల సహకారంతో త్వరలో వసూలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్రాబాద్ సీఐ రమేష్ కొత్వాల్, పదర ఎస్‌ఐ రాంబాబు పాల్గొన్నారు.