మహబూబ్‌నగర్

అట్టడుగుల జాతుల బలోపేతానికి ఉద్యమిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గట్టు, మార్చి 23: మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాజీ సింగిల్‌విండో చైర్మన్ నర్సన్న అధ్యక్షతన సభా సమావేశాన్ని నిర్వహించారు. గ్రామస్తులు వాల్మీకి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయగా ప్రముఖులు గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు డాక్టర్ ఆంజనేయ గౌడ్, డీసీసీబీ మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, కర్ణాటక వాల్మీకి సంఘం రాష్టన్రాయకులు అడ్వకెట్ సోమశేఖర్ నాయుడు, వెంకటేష్‌లు వేరువేరుగా హాజరయ్యారు. ఈసందర్భంగా బీసీ కమిషన్ సభ్యుడు మాట్లాడుతూ అట్టడుగు జాతులు అభివృద్ధి చెందే వరకు అందరం కలిసి ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కులాల వారిగా బీసీలకు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కుల వృత్తులేని బోయలకు ప్రభుత్వపరంగా ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం కల్పించిన సబ్సిడీ ట్రాక్టర్లు, కార్పొరేషన్ రుణాలు తదితర వాటిపై బోయలతో కలిసి ముఖ్యమంత్రికి అందజేసి, బోయలను ఆర్థికంగా ఆదుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెత్తందారులు గ్రామాల్లో ఆలయాలు, చర్చిలు, మసీదుల నిర్మాణాలకు అట్టడుగు జాతి బిడ్డలకు కంకర, సిమెంట్, కడ్డీలను అందజేసి కరివేపాకులా వాడుకొని కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందరు ఐక్యమత్యంగా ఉండి రాజకీయాలతో పాటు ఆర్థిక రంగాల్లో కూడా రాణించాలన్నారు. అదే విధంగా వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ ముఖ్య అతిథిగా పాల్గొన్ని, విగ్రహానికి పూలమాలలు వేసి దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేరుస్తానని, ఇప్పటి వరకు చేర్చలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తరుపున నుంచి తమ వంతుగా తీర్మానం చేపట్టామని, అసెంబ్లీలో తీర్మారం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు ఆమె తెలిపారు. పార్లమెంటులో ఎంపీ నంది ఎల్లయ్య బోయల అంశాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించేవారి గొంతు నొక్కుతుందని విమర్శించారు. బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేంత వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్‌పర్సన్ కృష్ణవేణి, పీసీసీ కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జడ్పీటీసీ బాసు శ్యామల, వాల్మీకి సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గోపినాయుడు, సర్పంచు సరోజనమ్మ, ఎంపీటీసీ శివరామిరెడ్డి, వెంకటేష్, రాములు, నల్లారెడ్డి, సద్దల రాములు, రఘు, చిన్న నర్సింహులు, హోటల్ నర్సింలు, రవి, రాము, కృష్ణ, గద్వాల తిమ్మప్ప, నడిగడ్డ యువత నాయకులు, బీసీ పోరం నాయకులు పాల్గొన్నారు.

పంటలు ఎండిపోతే
అధికారుల అంతు చూస్తాం
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హెచ్చరిక
ఆత్మకూర్, మార్చి23: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (పీజేపీ) ఆయకట్టు రైతులకు సంబంధించిన రబీ సిజన్‌లో ఒక ఎకరా కూడా ఎండిపోయినా పీజేపీ ఉన్నతాధికారుల అంతు చూస్తామని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆత్మకూర్ ఎంపీపీ శ్రీధర్‌గౌడ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు జూరాల నీటిని ఆయకట్టు రైతాంగానికి ఏప్రిల్ 20 వరకు కొనసాగించాలంటూ పెద్ద ఎత్తున్న సభలో నినాదాలు చేయడంతో పిజేపి ఏఈ శంకర్ బదిలిస్తూ ఈనెల చివరి వరకు మాత్రమే నీటి విడుదల సాధ్యమవుతుందని తేల్చి చెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు ఆత్మకూర్ మండలంలో ఉన్నప్పటికి తమ రైతుల పంట పొలాలకు నీరు ఇవ్వకుండా ముందుకు తీసుకెళ్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నీటి విడదుల కొనసాగిచాలంటూ ఈనెల 29న పీజేపీ అత్యసర సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ మేరకు మండల సభలో ప్రత్యేక తీర్మానం చేసి పీజేపీ ఉన్నతాధికారులకు, కలెక్టర్‌కు పంపించాల్సిందిగా ఎమ్మెల్యే ఎంపీడీవోను ఆదేశించారు. కింది స్థాయి సిబ్బందిని నిర్బంధిస్తేనే ఉన్నత అధికారులు సమావేశాలకు హజరవుతారని జడ్పీటీసీ సభ్యుడు బాలకిష్టన్న సూచించడంతో ఎమ్మెల్యేతో పాటు సభ్యులందరు ఏకీభవించారు. మండలంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొనసాగుతున్న ఎన్‌ఆర్‌ఈజీఎస్ రోడ్డు నిర్మాణ పనులు ఈనెల చివరి వరకు పూర్తి చేయాల్సిందిగా ఎమ్మెల్యే చిట్టెం ఆదేశించారు. ఆత్మకూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులు సమకూర్చిన నేపథ్యంలో ఆసుపత్రిలోనే ప్రసావాలు కొనసాగే విధంగా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అమరచింత, ఆత్మకూర్ మండలాలకు చెందిన తహశీల్దార్లు జీకే మోహన్, పాండునాయక్, ఎంపీడీవో శ్రీపాదు, ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఓటు హక్కు వజ్రాయుధం
- రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు చంద్రవదన్
బాలానగర్, మార్చి 23: రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు తమ పేర్లను ఆన్‌లైన్‌లో ఓటరుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు ఆర్వీ చందవదన్ అన్నారు. శుక్రవారం మండల బాలానగర్ మండల తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఒక్కరికి ఓటుహక్కు వజ్రాయుధం లాంటిదని, దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నామినేషన్ సమయం 10రోజులు ఉండగా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. మార్పులు, చేర్పులు ఏమైన ఉంటే వాటిని సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఓటరు నమోదు ప్రక్రియ అనుకున్నంత జరగలేదన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ డీఆర్‌ఓ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ అధికారి ఉపేందర్‌రెడ్డి, స్పెషల్ కలెక్టర్ ఆనంద్‌కుమార్, జడ్పీ సీఈఓ కొమురయ్య, తహశీల్దార్ రాంబాయి తదితరులు పాల్గొన్నారు.