మహబూబ్‌నగర్

అభివృద్ధిలో పాలమూరుకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 26: అభివృద్ధిలో పాలమూరుకు పెద్దపీట వేయబోతున్నామని, ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమైందని టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత, మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌లోని జడ్పీ మైదానంలో ఏర్పాటు చేసిన స్కిల్ ఇండియా, ఎంపౌవర్డు ఇండియా కార్యక్రమానికి నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్కిల్ ఇండియా పథకంలో ఉపాధి పొందేందుకు వచ్చిన నిరుద్యోగులు తమ దరఖాస్తులను చేసుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దేశ విదేశాలకు చెందిన 20 మంచి పెద్దపెద్ద కంపెనీలు రాబోతున్నాయని తెలిపారు. ప్రపంచ దేశాలలో తెలంగాణ నంబర్‌వన్ రాష్ట్రంగా ప్రపంచ పటంలో నిలిచిందన్నారు. అన్ని రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణ ఆర్థిక విధానం చాలా మెరుగుగా ఉందన్నారు. ముఖ్యంగా 27.7 శాతం ఆర్థిక విధానం పెంచుకోవడం జరుగుతుందని, దేశంలో మొదటి స్థానం తెలంగాణ ఉందని రెండవ స్థానం గుజరాత్ అని తెలిపారు. గుజరాత్ 18 శాతం ఆర్థిక విధానం ఉంటే అదే రాష్ట్రం మాత్రం 27 శాతంపైగా ఉందని అన్నారు. ముఖ్యంగా ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన పెద్దపెద్ద కంపెనీల సీఈఓలు ఓ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. అది గొప్ప నిర్ణయం అని భారతదేశంలోగానీ ఇతర దేశాల్లో గానీ మల్టీనేషనల్ కంపెనీలు ఎక్కడైనా ఏర్పాటు చేయాలనుకుంటే అది ముందుగా రాష్ట్రంలోనే ఏర్పాటు చేయడమే శ్రేయస్కారం అని నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఒక మహబూబ్‌నగర్ జిల్లాలోనే గత నాలుగున్నర ఏళ్ల కాలంలో దాదాపు ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని ఆయన వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి అయితే మరో ఎనిమిది లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి రానున్నాయని తెలిపారు. దాదాపు రూ.1200 కోట్ల ఉందానగర్ నుండి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం వరకు రైల్వే డబుల్‌లైన్ పనులు కొనసాగుతున్నాయన్నారు. మరో ఆరు మాసాల్లో ఈ పనులను పూర్తి చేస్తామని చెప్పారు. జడ్చర్ల నుండి మహబూబ్‌నగర్ వరకు నాలుగులైన్ల రోడ్డు ఏర్పాటు చేయబోతున్నామని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి కానుందన్నారు. గతంలో పాలమూరు జిల్లా అంటే వలసలు అని ఉందని కానీ భవిషత్తులో వలసలు వెళ్లిన వారు తిరిగి సొంత జిల్లాకు రావడం ఖాయమని తెలిపారు. అంతేకాకుండా ఇతర ప్రాంతాల వారు పాలమూరు జిల్లాకు వలసలు వచ్చేలా ఉంటుందని అన్నారు. చాలా మంచిరోజులు వచ్చాయని మున్ముందు మహబూబ్‌నగర్‌లో కూడా ఐటీ కారిడార్‌లో మంచి కంపెనీలు వచ్చి తీరుతాయని, అందుకు తాను కూడా ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా స్కిల్ ఇండియా ద్వారా యువత మంచి శిక్షణ పొంది మంచిగా ఉపాధి అకాశాలు కల్పించుకోవాలని ఆయన కోరారు. ప్రజలంతా బాగుండాలనే లక్ష్యంతో తాము ముందుకు వెళ్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో ఐటీ కారిడార్ రాబోతుందని, ఇప్పటికే దాదాపు 400 ఎకరాల భూమి సేకరణ జరిగిందని తెలిపారు. యువతకు మరిన్ని శిక్షణలు ఇచ్చి వారికి ఉపాధి కల్పిండమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రాధ, మాజీ ఎమ్మెల్యే స్వర్ణమ్మ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, నాయకులు శివకుమార్, సురేందర్‌రెడ్డి, మున్నూర్ రవి, మనోజ్, భగవాన్ తదిరులు పాల్గొన్నారు.