మహబూబ్‌నగర్

నిష్పక్షపాతంగా లబ్ద్ధిదారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసఋ౎టత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం పథకం పనులు అందరికి ఆదర్శంగా ఉండాలని నిష్పక్షపాతంగా నిజమైన లబ్దిదారులకు చేకూరేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి అన్నారు. గురువారం మహబూబ్‌నగర్ పట్టణ శివారులో గల ఆదర్శకాలనీ పక్కన గల డబుల్ బెడ్‌రూం పథకం సైట్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సైట్‌కు పక్కనున్న పరిసరాలు, రహదారి ఇతర పరిస్థితులను పరిశీలించారు. కాగా ప్రస్తుతం ఈ సైట్‌లో 332 డబుల్ బెడ్‌రూంల ఇళ్ల నిర్మాణానికి ప్రాణిళిక రూపొందించడం జరిగిందని తెలిపారు. ఇక్కడ చేపట్టే పనులు పూర్తి పారదర్శకంగా ఉండడంతో అందరికి ఆదర్శంగా నిలిచేలా అధికారులు సైట్ తనిఖీ సందర్భంగా సూచించారు. కాగా ఈ సైట్‌లో నిర్మించబోయే డబుల్ బెడ్న్రూం ఇళ్లు తెలంగాణలోనే ఆదర్శంగా ఉండేలా రూపకల్పన చేయాలని అన్ని వసతులతో కూడిన ప్రాంతంగా తయారు చేయాలన్నారు. పట్టణంలోని ప్రభుత్వ భూములకు సంబందించిన జాబితా మొత్తం తనకు అందజేయాలని సంబందిత రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన వారికి సంబందించిన భూముల వివరాలు కూడా అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఎలాంటి తప్పులకు తావు ఇవ్వకుండా డబుల్ బెడ్‌రూం లబ్దిదారుల ప్రక్రియ పారదర్శకంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఎవరికి కూడా ఆరోపణలకు తావు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 332 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ఈ సైట్‌ను రూపొందించామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట గృహనిర్మాణ శాఖ పిడి రమణరావు, ఆర్డిఓ హనుమంతురెడ్డి, తహశీల్దార్ ఆమరేందర్‌రావు తదితరులు ఉన్నారు.