మహబూబ్‌నగర్

తాగునీటి సమస్యను నివారించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 28: జిల్లాలో తాగునీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ శ్రీదేవి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో తాగునీటి పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా తగు చర్యలు తీసుకోవాలని అవసరమైన చోట మంచినీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని తెలిపారు. నీటి సమస్య ఉన్న గ్రామాల్లో వ్యవసాయ బోర్లను లీజుకు తీసుకుని ప్రజల ఇబ్బందులను తీర్చాలన్నారు. ఇప్పటికే 400లకుపైగా గ్రామాల్లో బోర్లను లీజుకు తీసుకుని ట్యాంకర్లను ఏర్పాటు చేసి నీటిని అందిస్తున్నామని నీటి ప్రాదాన్యత గురించి ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తే సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని తెలిపారు. జిల్లాలో రోజురోజుకు భూగర్భజలాలు అడుగంటి పోవడంతో నీటి సమస్య జటిలంగా మారిందని అయినప్పటికిని ప్రత్యామ్నయ చర్యలు తీసుకుంటున్నందున సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. కాగా సమావేశంలో పలువురు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు జిల్లాలో నెలకొన్న నీటి సమస్యపై కలెక్టర్‌కు వివరించారు. ఆర్డిఎస్ ఎండిపోవడంతో ఆ ప్రాంతంలో నీటి పథకాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. అంతేకాకుండా జూరాల ప్రాజెక్టులో కూడా నీరు అడుగంటిపోవడంతో రామన్‌పాడు ప్రాజెక్టుకు నీటిని అందివ్వడానికి ఇబ్బందులు ఉన్నప్పటికిని ప్రాజెక్టు భూభాగంలో కాలులు తవ్వి రామన్‌పాడుకు రెగ్యూలేటర్ల ద్వారా నీటిని అందిస్తున్నామని తెలిపారు. దాంతో రామన్‌పాడు ప్రాజెక్టులో కూడా కాలువలు తవ్వి తాగునీటి పంప్ హౌజ్‌లకు నీటిని అందిస్తుండడంతో జిల్లా కేంద్రంతో పాటు వివిధ గ్రామాలకు మంచినీరు అందుతుందన్నారు. అధికారుల పనితీరుపట్ల కలెక్టర్ అభినందిస్తూ ఎన్ని ఇబ్బందులు ఎదురైన మంచినీటిని ఎలాగైన అందించాలని సూచించారు. నిధులకు కొరత లేదని అవసరం ఉన్న చోట ప్రణాళికలు రూపొందించుకుని నిధులు ఖర్చు చేయాలని పైపుల మరమ్మత్తులకు తదితర వాటికి నిధులు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. వర్షాలు కురిసే వరకు నీటిని జాగ్రత్తగా వాడుకునేలా ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ పద్మనాభం పాల్గొన్నారు.