క్రైమ్/లీగల్

స్విమ్మింగ్ పూల్‌లో పడి ఇద్దరు చిన్నారుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల ఆందోళన
* ధర్నాతో మూడు గంటల పాటు నిలిచిన వాహనాలు
జడ్చర్ల, మే 18: జడ్చర్ల పట్టణ సమీపంలోని జాలీ హిల్స్ స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు అందులో మునిగిపోయి మృతి చెందారు. పట్టణ సమీపంలోని శంకరాయపల్లి తండాకు చెందిన హర్యానాయక్, బుజ్జిల కుమారుడు నరేశ్ (13), బుజ్జి సోదరి కుమారుడైన తిమ్మాజీపేట మండలం చింతకుంట తండాకు చెందిన శశాంక్ (14) శుక్రవారం మధ్యాహ్నం సమయంలో గ్రామానికి సమీపాన గల జాలీహిల్స్ హోటల్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఇందులో ఒకరికి ఈత రాగా మరో ఇద్దరికి ఈత రాకపోవడంతో ఇద్దరు ఒకరికొకరు పట్టుకొని నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న చుట్టూ ఉన్న వారు చిన్నారులు నీటిలో మునిగి పోవడం గమినించి వెంటనే వారిని నీటిలో నుండి బయటకు తీసి ఎస్‌విఎస్ ఆసుపత్రికి తరలించారు. వారిని పరిశీలించిన వైద్యులు అప్పటికే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుల్లో నరేశ్ షాద్‌నగర్‌లో ఎస్‌టీ హాస్టళ్లో ఉంటూ ప్రైవేటు పాఠశాలలో చదువుతుండే వాడు. శశాంక్ హైద్రాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటూ అక్కడే ఏడో తరగతి చదువుంతుడేవాడు. వేసవి సెలవులు కావడం వల్ల సరదాగా చిన్నమ్మ బుజ్జి ఇంటికి వచ్చిన శశాంక్ ఈత కొలనులో పడి మృతి చెందాడు. ఇద్దరు చిన్నారులు ఒకేసారి మృత్యుబారిన పడటంతో వారి కుటుంబాల వారు కన్నీరుమున్నీరు అయ్యారు. ఈత కొలనులో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే చిన్నారులు మృతి చెందినట్లు శంకరాయపల్లి తండావాసులు, చుట్టుపక్కల తండాల ప్రజలు జాలీహిల్స్ హోటల్ వద్దకు చేరుకొని హోటల్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్బంగా వారు మహాబూబ్‌నగర్ నుండి జడ్చర్ల రహదారిపై జాలీ హిల్స్ ముందు రాస్తారోకో,్ధర్నా చేశారు. రాస్తారోకోతో రహదారిపై సుమారు 3గంటల పాటు వాహానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అప్పన్న పల్లి నుండి జడ్చర్ల వరకు రోడ్డుకు ఇరువైపుల వాహనాలు బారులు తీరాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని బాధితులను, ఆందోళన కారులను అక్కడి నుండి పంపివేసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.