మహబూబ్‌నగర్

రైతుబంధుతో రైతుల్ని మోసం చేస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్వాడ, మే 25: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంతో రైతులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేస్తోందని డీసీసీబీ చైర్మన్ కె.వీరారెడ్డి విమర్శించారు. శుక్రవారం మరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కె.వీరారెడ్డి మాట్లాడుతూ రైతుబంధు పథకంతో రైతులను పనులు చేసుకోకుండా బ్యాంకుల చుట్టు తిప్పుతున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. రైతుబంధు పథకంలో రైతులకు ఉన్న భూమికూడా సక్రమంగా చూపించకుండా తప్పుల తడకగా మారిందన్నారు. పేరుకు మాత్రమే ఎకరాకు రూ.4వేలు ఇస్తున్నామని చెబుతున్నా మరోపక్క భూమిని తక్కువగా చూపున్నారని, దీంతో రైతులు తమతమ భూముల సర్వేలు సక్రమంగా లేవని తహశీల్దార్ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారని దుయ్య బట్టారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రైతులు పంటల కోసం చేసిన అప్పులు తీర్చాలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పలకరించిన పాపానపోలేదన్నారు. రాబోయో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వంకు తగినబుద్దిచేప్పాలన్నారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పతనం తప్పదన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లాలుప్రసాద్, సంజీవరెడ్డి పాల్గొన్నారు.