మహబూబ్‌నగర్

ఘనంగా అవతరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, మే 25: గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా రాష్ట్ర ఆవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణపై రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి చందూలాల్ మాట్లాడుతూ గ్రామస్థాయి మొదలుకొని జిల్లా స్థాయి వరకు అన్ని పాఠశాలల్లో వేడుకలు నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాలలోని ప్రముఖులకు అవార్డులు ఇవ్వాలని సూచించారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించాలని, జాతీయ పతాక ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, కళాకారుల ర్యాలీ, కవి సమ్మేళనం అన్ని పాఠశాలలో ప్రభాతబేరి నిర్వహించాలని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వనపర్తి కలెక్టర్ శే్వతా మహంతి మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా తెలంగాణ అంశం ప్రస్పుటించేలా తంగేడు, జమ్మి, మొక్కలకు హరితహారం, స్టాళ్ళ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇతర శాఖలు కూడా వారి వారి స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ, అవార్డుల ఎంపికకు గతంలో మాదిరిగానే కమిటీలు ఆయా శాఖల ద్వారా వచ్చిన దరఖాస్తులు పరిశీలించి ఎంపిక చేయాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో పాటు ముఖ్య అతిథి సందేశం, పాఠశాల విద్యార్థులకు ఉసన్యాస, డ్రాయింగ్, పెయింటింగ్, పోటీలు నిర్వహించాలని చెప్పారు. కార్యక్రమంలో జేసీ చంద్రయ్య, ట్రైనీ ఐఎఏస్ సంతోష్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.