మహబూబ్‌నగర్

ఆశావాహులకు ఏఐసీసీ ఝలక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 25: కాంగ్రెస్ నూతన జిల్లా అధ్యక్షులను ఏఐసీసీ శుక్రవారం ప్రకటించింది. దీంతో మళ్లీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉబెదుల్లా కొత్వాల్‌కే పగ్గాలను అప్పజెప్పింది. కాగా అందరు ఆశీంచిన విధంగా నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాలకు కూడా ప్రత్యేకంగా డీసీసీ అధ్యక్షులను ప్రకటిస్తారానుకున్న ఆ జిల్లాలోని ఆశావాహులకు ఏఐసీసీ నిరాశే మిగిల్చింది. అదేవిధంగా ఉమ్మడి జిల్లా అధ్యక్ష పీఠం కోసం కొందరు నాయకులు చేసిన లాబియింగ్‌లను ఏఐసీసీ పట్టించుకోకుండా వారికి ఝలక్ ఇస్తూ మళ్లీ డీసీసీ అధ్యక్షుడిగా ఉబెదుల్లా కొత్వాల్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆశావాహులకు ఏఐసీసీ ఝలక్ ఇచ్చింది. ఉమ్మడి జిల్లా అధ్యక్ష పదవిపై కనె్నసిన పలువురు నేతల్లో వినోద్‌కుమార్, భగవంత్‌రావు, సంజీవ్ ముదిరాజ్, రెడ్డిగారి రవీందర్‌రెడ్డి ఆశలు ఆడిశయాలు అయ్యాయి. అయితే జోగుళాంబ గద్వాల జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పటేల్ ప్రభాకర్‌రెడ్డిని అక్కడి జిల్లా నాయకులు నియమించుకున్నప్పటికిని ప్రస్తుతం ఏఐసీసీ నిర్ణయంతో ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉండే వీలు లేకుండా పోయింది. ఏఐసీసీ బైలాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాల జాబితా ఇంకా జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేర్చకపోవడంతోనే పాత జిల్లాలకే కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా శంకర్‌ప్రసాద్‌ను నియమించుకున్నారు. ఇది కూడా ఏఐసీసీ దృష్టిలో చెల్లుబాటు కాదని చెప్పవచ్చు. జోగుళాంబ గద్వాల జిల్లా, వనపర్తి జిల్లాల అధ్యక్షులుగా ప్రకటించిన వారు ఇక మీదట డీసీసీ అధ్యక్షుడిగా చెప్పుకునే వీలు లేకుండా పోయింది. ఏఐసీసీ నిర్ణయంతో ఆయా జిల్లాల నాయకులు ఖంగుతిన్నారు. అయితే ఉబెదుల్లాను తిరిగి డీసీసీ పగ్గాలు అప్పజెప్పడం వెనుక కాంగ్రెస్ జాతీయ నాయకత్వం లోతుగా కసరత్తు చేసినట్లు తెలుస్తుంది. ప్రధానంగా డీసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్న ఉబెదుల్లా కొత్వాల్ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా కొనసాగడం చిన్నారెడ్డి, కొత్వాల్ ఇద్దరే సీనియర్లుగా ఉండడంవల్ల ఇద్దరు పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికిని చిన్నారెడ్డి ఏఐసీసీ కార్యదర్శిగా కొనసాగుతుండడంతో ఆయనను పక్కన పెట్టి కొత్వాల్‌కు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. 1983లో ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ 1992లో డీసీఎంఎస్ చైర్మన్‌గా కూడా కొత్వాల్ పదవీ బాధ్యతలు కూడా చేపట్టారు. అమరచింత నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా పోటీ చేసిన ఓటమి చెందారు. అదేవిధంగా 1999లో కొల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించినప్పటికిని చివరికి అభ్యర్థిని అధిష్ఠానం మార్పు చేసినప్పటికిని కొత్వాల్ నిరాశ చెందకుండా పార్టీకి పనిచేశారు. 2009లో కూడా మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి టిక్కెట్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అయినప్పటికిని ఆయన పార్టీని నమ్ముకుని ముందుకెళ్లారు. ఈ సమయంలో అప్పట్లో మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ పార్టీ నుండి కేసీఆర్ ఇక్కడ పోటీ చేసిన సమయంలో కాంగ్రెస్ టికెట్ కొత్వాల్‌కు రాకపోవడంతో ఎలాగైన ఉబెదుల్లా కొత్వాల్‌ను టీఆర్‌ఎస్‌లోకి తీసుకుని మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీకి దింపాలని కేసీఆర్ వ్యూహం పన్నారు. పలువురు దూతలను కూడా కొత్వాల్ దగ్గరకు పంపించి చర్చలు జరిపినప్పటికిని ఉబెదుల్లా కొత్వాల్ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడానికి నిరాకరించారు. పార్టీలో అలాగే కొనసాగుతున్న నేపథ్యంలో 2012లో డీసీసీ అధ్యక్షుడిగా ఏఐసీసీ కొత్వాల్‌కు పదవీ బాధ్యతలు అప్పజెప్పింది. అలాగే కొత్వాల్ 2014లో సైతం కాంగ్రెస్ అభ్యర్థిగా మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేశారు. చాలామంది కొత్వాల్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి కొందరు వెన్నుపోటు పొడిచినా వాటన్నింటిని పట్టించుకోకుండా ఆయన జిల్లాలో పార్టీకి సేవలు అందించారు. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికిని ఆయన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకు వెళ్లడంతోనే మరోసారి ఏఐసీసీ పెద్దలు ఆయన సేవలు ఇంకా పార్టీకి అవసరం ఉన్నాయని గుర్తించే తిరిగి రెండవసారి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. కొడంగల్, షాద్‌నగర్, కల్వకుర్తి నియోజకవర్గాలు కూడా కొత్వాల్ పరిధిలోకే రానున్నాయి. ఈ నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలు ప్రస్తుతం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉండడం ఈ పరిధి కాకుండా గత ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిని ఆధారం చేసుకునే డీసీసీ అధ్యక్షుడిగా ఉబెదుల్లా కొత్వాల్‌కు పగ్గాలను అప్పజెప్పింది. ఇలా ఉండగా రెండోసారి కొత్వాల్‌కు డీసీసీ పీఠం కట్టజెప్పుతూ ఏఐసీసీ తీసుకున్న నిర్ణయం పార్టీలోని ఇతర ఆశావాహులకు ఝలక్ ఇచ్చినట్లు అయ్యింది. కాగా, ఏఐసీసీ తీసుకున్న నిర్ణయం పట్ల ఉబెదుల్లా కొత్వాల్ జిల్లా, రాష్ట్ర, జాతీయ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.