మహబూబ్‌నగర్

గ్రామీణ రోడ్లకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూర్, మే 26: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలోని రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేస్తుందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆత్మకూర్ మండలంలోని పిన్నంచర్ల, గుంటిపల్లి గ్రామాలలో రూ. 3కోట్ల వ్యయంతో చేపట్టే బీటి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన సంవత్సరం కాలంగా రాష్ట్రంలోని అంతర్గత రహదారుల నిర్మాణాలతో పాటుగా బీటి రోడ్డు నిర్మాణాలకు సైతం ప్రభుత్వం పెద్ద ఎత్తున్న నిధులు విడుదల చేసినట్లుగా ఆయన తెలిపారు. గిరిజన తండాలలో సైతం బీటి రోడ్డు నిర్మాణాలను చేపట్టడం టీ ఆర్ ఎస్ ప్రభుత్వానికే సాధ్యమన్నారు. మక్తల్ నియోజక వర్గంలో రైతుబందు పథకానికి సంబందించి తనతో పాటుగా మరి కొంత మంది ప్రజాప్రతినిధులు చెక్కులను ప్రభుత్వానికి అందజేయడం సంతోషకరమన్నారు. గుంటిపల్లి,పిన్నంచర్ల గ్రామాలకు సంబందించిన వ్యవసాయ పొలాలకు సాగునీటిని పూర్తి స్థాయిలో అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కోన్నారు. అంతకు ముందుగా గుంటిపల్లి గ్రామానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ ఎంపిపి శ్రీ్ధర్‌గౌడ్, మక్తల్ , ఆత్మకూర్ మార్కెట్ కమిటి చైర్మన్లు రాజేందర్‌సింగ్, నర్సింహులుగౌడ్, టీ ఆర్ ఎస్ మండల పార్టీ అద్యక్షులు రవికుమార్‌యాదవ్, ఎంపిటిసి సభ్యులు అనిల్‌కుమార్‌గౌడ్,సుదర్శన్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షులు గాడికృష్ణమూర్తి, ఆయా గ్రామాల సర్పంచులు వెంకటేష్, ప్రకాష్, మచ్చేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

పల్లెల అభివృద్ధితోనే రాష్ట్భ్రావృద్ధి: ఆల
చిన్నచింతకుంట, మే 26: పల్లెల అభివృద్ధితోనే రాష్ట్భ్రావృద్ధి అన్ని రంగాలలో అభివృద్ధి సాదిస్తుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పలు అభివృద్ది కార్యక్రమంలో అయన పాల్గోని మాట్లాడుతూ టిఅర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపేట్టిన సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని అయన తెలిపారు. రైతుబంధుతో రైతుకు ధీమాను కల్పించామని, జూన్‌లో రైతుకు భీమాతో ధైర్యాన్ని కల్పిస్తామని ఆయన తెలిపారు. లాల్‌కోట నుంచి పల్లమర్రి వరకు రూ.2.10 కోట్లుతో బిటి రోడ్డు నిర్మాణానికి భూమిపూజ, దాసర్‌పల్లి గ్రామానికి రూ.85లక్షలతో బిటి రోడ్డుకు భూమి పూజ, వడ్డేమాన్‌లో ఉర్దూ పాఠశాల నూతన భవానాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మండలకేంద్రంలోమండల మహిళ సమాఖ్య నూతన భవనాన్ని ప్రారంభించారు. మహిళలు సంక్షేమానికి కేసీఅర్ ప్రభుత్వం కట్టుబడి వుందని అయన తెలిపారు.
వ్యవసాయం లాభసాటిగా మార్చుకోవాలి
వ్యవసాయ శాస్తవ్రేతల సూచనలకు పాటించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. శనివారం మండల కేంద్రంలో కిసాన్‌మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలంలో పుష్కలంగా సాగునీరు వుందని రైతులు వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పేట్టాలని అయన సూచించారు. ఆధునిక వ్యవసాయంపై రైతులు అసక్తి చూపాలని, వ్యవసాయ అదికారుల సూచించిన మేరకు పంటలకు సరిపడా మోతాదులో వాడి అధిక దిగుబడి సాంధించుకోవాలని అయన సూచించారు. అంతకుముందు కిసాన్‌మేళాలోని స్టాలను పరిశీలించారు.