మహబూబ్‌నగర్

అన్నదాతల సంక్షేమానికే పెట్టుబడి సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 26: రైతు సంక్షేమం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరుగుతుందని అందులో భాగంగా ఈ నెల 10వ తేది నుండి 18వ తేది వరకు రాష్టమ్రంతట ఖరీఫ్ పంటకు గాను ఎకరాకు రూ.4వేల పెట్టుబడి సహయాన్ని అందజేయడం జరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎమ్మెల్యేలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ భూరికార్టుల ప్రక్షాళనను తిరిగి పరిశీలన చేసి సరిచేసి అందజేయడానికి ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. గతంలో మూడునెలల పాటు రెవెన్యూ సిబ్బంది గ్రామాల్లో తిరిగి భూరికార్డుల ప్రక్షాళన చేపట్టడం జరిగిందని అయితే వాటిల్లో వివిధ సమస్యల మూలంగా 100శాతం సర్వేపూర్తి చేసి పట్టాదారు పాసుపుస్తకాలు, చెక్కులు అందజేయలేకపోయారని అన్నారు. అందుకుగాను జూన్ 15వ తేదిలోపు పట్టాదారు పుస్తకాల ముద్రణ పూర్తి చేసి జూన్ 20వ తేదిలోగా రెవెన్యూ, వ్యవసాయ సిబ్బంది గ్రామాల్లో తిరిగి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించి ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారి చేశారని సరిచేసిన ఖాతాలకు సంబంధించిన పాసుపుస్తకాలు, చెక్కులు జూన్ 20వ తేది నుండి 26వ తేదిలోపు పంపిణీ పూర్తిచేయాలన్నారు.
రెవెన్యూ సిబ్బంది అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి తప్పులు చదివి వినిపించాలని విరాసత్ చేయాల్సిన ఖాతాల విషయంలో సమస్యలు పరిష్కరించి ఉత్తర్వులు జారీ చేస్తారని ఆధార్ సమర్పించని వారు వెంటనే ఆధార్‌ను సమర్పించాలని అన్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు తమ వంతు సహయ సహకారాలు అందించాలని అన్నారు. ముఖ్యంగా పేద రైతులకు ఇది ఒక మంచి అవకాశం కాబట్టి గ్రామసభల్లో పాల్గొని సహకరించి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో ఇంతవరకు భూరికార్డుల ప్రక్షాళన చేయలేదని ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. భూరికార్టుల ప్రక్షాళన పూర్తి అయిన వెంటనే ధరణి వెబ్‌సైట్‌లో వివరాలను పొందుపర్చడం జరుగుతుందని ఇకపై రికార్డుల మార్పిడి, అమ్మకాలు జరిపినప్పుడు వెంటనే సంబందిత అధికారులు రికార్డులను మార్పు చేసి పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ భూపంచాయతీలు అధికంగా ఉండేవని ఎరువులు, పోలీస్‌స్టేషన్‌లో పంపిణీ చేయాల్సిన అవసరం వచ్చేదని సంవత్సరానికి ఎకరాకు రూ.8వేలు ఇచ్చే దమ్మున్న ముఖ్యమంత్రి మనకు దొరకడం అదృష్టమని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా రైతుసమన్వయ సమితి అధ్యక్షుడు బస్వరాజ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.