మహబూబ్‌నగర్

పెరుగుతున్న కూరగాయల ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, జూన్ 18: సామాన్య ప్రజలకు అందనంత ఎత్తులో నిత్యవసర సరుకుల ధరలు ఉండి సతమతమవుతుండగా, కూరగాయల ధరలు వింటేనే గుండె ఆగిపోయేంత పనవుతుందని వినియోగదారులు వాపోతున్నారు. పచ్చిమిర్చి ధర కిలో రూ.60లకు చేరిందంటే కూరగాయల ధరలు ఏవిధంగా పెరుగుతున్నాయో ఊహించుకోవచ్చు. మార్కెట్‌లో కూరగాయాల ధరలు విపరీతంగా పెరిగిపోతూ సామాన్య, మధ్య ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. వ్యాపారస్థులు సైతం కూరగాయలను ఎక్కువగా తెచ్చుకోవడంలేదు. కూరగాయలు, ఆకుకూరల సాగు తగ్గడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. రైతులు ఆకుకూరలు, కూరగాయలను పండించేవిధంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడంతో పాటు సబ్సిడీపై విత్తనాలు, స్ప్రింక్లర్లు, డ్రిప్ తదితర వాటిని అందిస్తున్న వీటి గురించి రైతులకు వివరించడంలో సంబంధిత ఉద్యానవన శాఖ విఫలమైందని చెప్పవచ్చు. రైతులు వీటిని పండించడం వల్ల వచ్చే లాభాల గురించి వివరించి పెద్ద మొత్తంలో కూరగాయలను, ఆకుకూరలను సాగు చేసేవిధంగా చూసినట్లైతే నేడు మార్కెట్‌లో వీటి ధరలు పెరిగేవి కావని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం టమాటా ధర 20నుండి 30 రూపాయల వరకు ఉండగా, బెండకాయ, గోకరకాయ, వంకాయ తదితర కూరగాయల ధరలు కిలో 40 రూపాయలు, చిక్కుడు కాయ కిలోకి 60 రూపాయలు ఉంది. పచ్చిమిర్చి రూ.60ల వరకు అమ్ముతున్నారు. ఇతర కూరగాయల ధరలు కూడా కిలో 40 నుండి 60 రూపాయల మధ్య ఉన్నవి. మున్ముందు ఇదే పరిస్థితి నెలకొని ఉంటే మధ్య తరగతి ప్రజలు కూరగాయలను కొనడమే మానేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పవచ్చు. జిల్లా అధికార యంత్రాంగం స్పందించి రైతులు ఎక్కువగా కూరగాయలను, ఆకుకూరలను సాగుచేసేవిధంగా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.

తప్పుడు ధృవపత్రాలు సమర్పిస్తే వేటు ఖాయం..!
- ప్రతి ఉపాధ్యాయుడికి న్యాయం జరిగేలా బదిలీలు - ఉపాధ్యాయ సంఘాల నేతల సమావేశంలో కలెక్టర్ రోనాల్డ్‌రోస్

మహబూబ్‌నగర్, జూన్ 18: బదిలీల ప్రక్రియలో భాగంగా ఎవరైనా ఉపాధ్యాయులు తప్పుడు ధృవపత్రాలు సమర్పించి తప్పుదారి పట్టించినట్లు రుజు వైతే అలాంటివారిపై వేటు వేసి, కేసులకు కూడా వేనుకాడబోమని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ హెచ్చరించారు. సోమవారం తన చాంబర్‌లో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియపై విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముందుగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు బదిలీలలో జరుగుతున్న విషయాలపై కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని పాఠశాలల కేటగిరి విషయాల్లో కూడా ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలెక్టర్ దృస్టికి తీసుకురాగా వాటిని తక్షణమే సరిచేసి సాయంత్రంలోపు నివేదిక తన ముందు ఉంచాలని సూచించారు. నాల్గో కేటగిరి పాయింట్స్‌ను 2013 మే 5వ తేదీ దాకా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 2009-12 బదిలీలలో నాల్గో కేటగిరి కలిగిన పాఠశాలలకు మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు. ఎవరైన ఉపాధ్యాయులు తప్పుడు వైద్య ధృవ పత్రాలు, స్పౌజ్ సర్ట్ఫికెట్స్ సమర్పించిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. స్పౌజ్, ప్రత్యేక కేటగిరి జాబితాను సంబంధిత కార్యాలయాలపై అతికించాలని సూచించారు. ఎస్సెస్సీ పాయింట్స్‌ను 0.5 ఆ పైన ఉన్నప్పుడు పైన ఉన్న నంబర్‌కు రౌండ్ ఫిగర్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆన్‌లైన్ విధానంతో బదిలీల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఎవరైన తప్పుడు దరఖాస్తులు చేసుకున్న పాయింట్స్‌ను తప్పులు వేసినా వెంటనే తెలిసిపోతుందని ఈ విషయాన్ని ఎంఈఓలు పరిశీలించాలన్నారు. అధికారులుగానీ, ఉపాధ్యాయులు గానీ తప్పులు చేస్తే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. ఉపాధ్యాయ సంఘాలు బదిలీలపై పూర్తి సహకారం అందిస్తున్నారని, నిబంధనాలకు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డీఈఓ సోమిరెడ్డి, జాయంట్ కలెక్టర్ వెంకటరమణ, డీఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ సంఘాల నేతలు వెంకట్‌రెడ్డి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.