మహబూబ్‌నగర్

పార్టీ ఏదైనా పక్కాగా బరిలోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 19: రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నా.. పార్టీ ఏదైనా తాను మాత్రం వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగడం పక్కా అంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయే గానీ తాను మాత్రం మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండే బరిలోకి దిగాలని ఎర్ర శేఖర్ నిర్ణయం తీసుకున్నట్లు పక్కా సమాచారం. టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయా? లేక టీఆర్‌ఎస్ టీడీపీ కలిసి పోటీ చేస్తాయా? ఏదైనా ఎర్ర శేఖర్ మాత్రం మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుండే పోటీ చేయాలని నిర్ణయించుకుని జిల్లా కేంద్రంలో రాజకీయంగా పావులు కదుపుతున్నారు. దివంగత ఎమ్మెల్యే ఎర్ర సత్యం సోదరుడు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారంటూ ఇప్పటికే నియోజకవర్గంలో గత నెల రోజుల నుండి ప్రచారం జరుగుతోంది. అది నిజమనే సంకేతాలు కూడా వచ్చేశాయి. దాంతో ఒక్కసారిగా మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో ఎవరినోట విన్నా ఇదే అంశం ప్రస్తావనకు వస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఇక్కడి నుండి పోటీ చేస్తే రాజకీయ పరిణామాలు ఎటు వైపు వెళ్తాయోననే చర్చ మాత్రం అప్పుడే మొదలైంది. మంగళవారం జిల్లా కేంద్రానికి చెందిన కొందరు ప్రముఖులు, వ్యాపారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు సైతం ఎర్ర శేఖర్‌ను రహస్యంగా కలిసి మద్దతు తెలిపినట్లు సమాచారం. ప్రధానంగా దివంగత ఎమ్మెల్యే ఎర్ర సత్యం అభిమానులు, అనుచరులు ఎర్ర శేఖర్ మహబూబ్‌నగర్‌లో పోటీ చేయడాన్ని స్వాగతిస్తున్నారు. ఇందుకుగాను ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో హన్వాడ, మహబూబ్‌నగర్ మండలాలలోని కొంత మంది నాయకులతో చర్చించినట్లు కూడా తెలుస్తోంది. జడ్చర్ల నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఎర్ర శేఖర్ ప్రస్తుతం నియోజకవర్గాన్ని మార్చుకోవాలని చూడటం వెనక చాలా కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయేనని అందుకే జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే గెలుపు సునాయసంగా ఉంటుందనే భావనతో ఎర్ర శేఖర్ ఉన్నట్లు తెలుస్తుంది. 2019 ఎన్నికల్లో ఎర్ర శేఖర్ టీడీపీ నుండి పోటీ చేస్తారా? లేక కాంగ్రెస్ నుండి పోటీ చేస్తారా? అనే మరో ప్రచారం కూడా జరుగుతోంది. మరో అత్యంత రహస్యమైన చర్చలు కూడా జరిగాయనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రముఖ నేత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత దగ్గరగా ఉంటూ రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు కేసీఆర్‌తో చర్చించే నాయకుడు ఒకరు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌కు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారని ఆయన అనుచరులు బహిరంగంగానే చెబుతున్న విషయం. అది ఎర్ర శేఖర్‌ను టీఆర్‌ఎస్‌లోకి రావాలంటూ ఆఫర్ వచ్చిందని కూడా ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుండి టికెట్ ఇప్పించే బాధ్యత కూడా నాదే అని కూడా ఆ నాయకుడు భరోసా కూడా ఇచ్చారని ఎర్ర శేఖర్ అనుచరులు చెబుతున్నారు. కాగా ఇక్కడ టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడంతో అది సాధ్యం కాదని టీఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో సిట్టింగ్‌లకే టిక్కెట్లు అని ప్రకటించడంతో ఎర్ర శేఖర్‌తో ఓ టీఆర్‌ఎస్ నేత చర్చించిన సందర్భంలో కూడా సిట్టింగ్‌లకే టికెట్లు అనే విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయంగా రాబోయే కాలంలో నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఎర్ర శేఖర్ మాత్రం మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ను మంగళవారం మహబూబ్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆంధ్రభూమి ప్రతినిధి కలిసి సంప్రదించగా తాను వచ్చే ఎన్నికల్లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండే పోటీ చేయాలని భావిస్తున్న మాట వాస్తవమని అంగీకరించారు. అందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నానని ప్రస్తుతం టీడీపీ నుండే పోటీ చేయాలనుకుంటున్నానని భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయోనని చూద్దామన్నారు. రాష్ట్ర రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతాయోగానీ జిల్లాలో మాత్రం రాజకీయమంతా అనూహ్యంగా ఉంటుందన్నారు. తాను మాత్రం ఈ దఫా మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుండే పోటీకి దిగాలని మాత్రం భావిస్తున్నట్లు ఆయన మరోసారి చెప్పకనే చెప్పారు. తనకు జడ్చర్ల, మహబూబ్‌నగర్ నియోజకవర్గాల్లో ఎక్కడ పోటీ చేసినా ఈ సారి మాత్రం గెలిచి తీరుతాననే ధీమాను సైతం ఎర్ర శేఖర్ వ్యక్త పరిచారు.