మహబూబ్‌నగర్

యోగాతో మనిషికి మంచి జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, జూన్ 21: యోగతో మనిషికి మంచి జీవితం అందుతుందని జిల్లా కలెక్టర్ ఇ.శ్రీ్ధర్ అన్నారు. ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో అయూష్ విభాగం, పతాంజలి యోగా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ యోగ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. చాణుక్యుడు, వాత్స్యాయనుడు, పతంజలి తదితర మహానీయులు రచించిన గ్రంథాలు నేటికి మానవ జీవితానికి ఉపయోగపడుతున్నాయని అన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే యోగ అభ్యాసం చేయించాలని ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులను కోరారు. పాఠశాలలో విధిగా యోగ అభ్యాసనం పాఠ్యాంశాన్ని చేర్చి ప్రతి రోజు పాఠశాలలో యోగ చేసే విధంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. శరీరంలోని అన్నీ భాగాలు సక్రమంగా పనిచేస్తేనే ఆరోగ్యం బాగుంటుందని, మైండ్ పాజిటివ్‌గా పని చేస్తుందని, తద్వారా మంచి ఆలోచనలతో జీవితంలో ముందుకు వెళ్లడానికి మార్గం సులభతరం అవుతుందన్నారు. శారీరక శ్రమ తగ్గినప్పుడే అనారోగ్య సమస్యలు వస్తాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రోజు యోగా చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పతంజలి యోగా సమితి రాష్ట్ర అధ్యక్షులు శివుడు వివిధ ఆసనాల గురించి వివరించారు. యోగా ప్రాముఖ్యత గురించి వివరించారు. విద్యార్థి దశ నుంచి యోగాచేస్తే ఆరోగ్యంగా ఉండటంతోపాటు మంచిగా చదువుకోవడం జరుగుతుందని అన్నారు.

యోగాతో శారీరక, మానసిక దృఢత్వం
* ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి
వనపర్తి, జూన్ 21: యోగా ద్వారా శారీరక, మానసిక దృఢత్వాన్ని సాధించవచ్చునని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆయన భారత యోగా సాధకుల సంఘం వనపర్తి వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవానికి హజరై యోగా సాధన చేశారు. ఈ సందర్బంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రతి ఒక్కరికి శారీరక శ్రమ ఉండేదని, గ్రామాలలో ఆటల ద్వారా , బావులలో ఈత ద్వారా శారీరక శ్రమ పొందే వారని, ప్రస్తుతం శారీరక శ్రమ అన్నది లేదని, యోగా ద్వారా శారీరక శ్రమ చేయవచ్చని, తద్వారా శారీరకంగా,మానసికంగా, దృఢంగా ఉండడానికి అవకాశం ఉందన్నారు. యోగా ఏ ఒక్క కులానికో, మతానికో సంబంధించినది కాదని, అందు వల్ల యోగాను ప్రతి ఒక్కరు తప్పక నిత్యం చేయాలని కోరారు. తాను ప్రతి రోజు నడకతో పాటు తనకు తెలిసిన యోగా సాధన చేస్తానని చెప్పారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రపంచ యోగా దినోత్సవం రోజున పెద్ద ఎత్తున్న కార్యక్రమం నిర్వహించినందుకు నిర్వహకులను ఆయన అభినందించారు. యోగాను పాఠ్యంశంగా చేర్చాలని కోరిన నిర్వహకుల కోరికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, ఎంపిపి శంకర్‌నాయక్, అమరేందర్‌రెడ్డి, అధికారులు పాల్గోన్నారు.