మహబూబ్‌నగర్

ప్రతి ఒక్కరు శారీరక శ్రమకు అలవాటు పడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో సంబురంగా యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. అందులో భాగంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ అనురాధ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శారీరక శ్రమను అలవాటు చేసుకుని నిత్యజీవితంలో భాగంగా మార్చుకోవాలని అన్నారు. ఆరోగ్యం పరిరక్షించుకునేందుకుగాను యోగా, నడక, సూర్యనమస్కారాలు ప్రతినిత్యం చేయాలని కోరారు. గతకాలంలో మనిషికి శారీరక శ్రమ వలన మానసిక, శారీరక సత్వ కలిగేవారని కానీ నేటి ఆధునీక సమాజంలో కనీసం నడకకూడా కరువైందనే విషయం అందరికి తెలిసిందేనని తద్వారా చిన్న వయస్సులోనే మనిషి అనారోగ్యాలకు గురవుతున్నారని ఆమె విచారణ వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల నుండి బయటపడడానికి ప్రతి కుటుంబం ఆరోగ్యమైన అలవాట్లకు పాటుపడాలని ముఖ్యంగా పోలీసు విబాగానికి చెందిన యావత్తు సిబ్బంది నిత్యం చేసే కసరత్తుల వల్ల రక్షణ విభాగం బలోపేతం అవుతుందని అన్నారు. స్పెషల్ పార్టీ, సాయుధ బలగాలకు అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు చేయిస్తున్న యోగా సాధన అద్భుతంగా ఉందని ఆమె అభినందించారు. అదేవిధంగా మాడ్రన్ హైస్కూల్ ప్రాంగణంలో కెడం గోదాగోపాలకృష్ణ యోగా శిక్షకురాలు మాస్టర్ మైండ్ పాఠశాల ఆధ్వర్యంలో ప్రాణాయమం ఆసనాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకురాలు పల్లెర్ల వినాయక్‌రావు, ప్రధానోపాధ్యాయురాలు అరుణ, లావణ్యలు మాట్లాడుతూ అనునిత్యం విద్యార్థులు తమ మనోవికాసానికై తప్పకుండా అసనాలు, ప్రాణాయా మం పాటించాలని సూ చించారు. కార్యక్రమంలో సిఐలు సీతయ్య, వీరేష్, దిలీప్ పాల్గొన్నారు.

రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొసలి కన్నీరు
* అసలైన రైతుబంధువు మోదీయే..* బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి

వనపర్తి, జూన్ 21: తెలంగాణ రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలుగా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసి ఎన్నికల కోసం పథకాలను పెడుతూ రైతుల పట్ల టీ ఆర్ ఎస్ ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని బీజేపీ జిల్లా అద్యక్షులు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. గురువారం వనపర్తి జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని అమలు చేస్తున్న పథకాలను ప్రజలోకి తీసుకేళ్లేందుకు జన చైతన్యయాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అద్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ నాయకత్వంలో ఈనెల 23న యాదగిరిగుట్టలో యాత్ర ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. 400 మంది రాష్ఠ్ర నాయకులు ఈ యాత్రలో పాల్గొంటారని ఆయన తెలిపారు. 26న వనపర్తి జిల్లాలో ఈ యాత్ర ఉంటుందని ఈసందర్బంగా వెయ్యి మోటర్ సైకిళ్ళతో భారీ ర్యాలీ నిర్వహించి వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
వనపర్తి నియోజక వర్గానికి సంబంధించిన పదివేల మంది హజరవుతారని ఆయన తెలిపారు. నరేంద్రమోదీ పాలన నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా జరుగుతున్న ఈ యాత్ర రైతుల కోసం మద్దతు ధర పెంచడం, ఫజల్ బీమా యోజన, రాష్ట్ర ప్రభుత్వ అవకతవకల పథకాలు తదితర వాటిపై రాష్ట్ర నేతలు మాట్లాడుతారని ఆయన తెలిపారు. మోదీయే నిజమైన రైతుబందువని ఆయన అన్నారు. ఆగష్టు 15తేది నుండి భారతదేశంలో 50 కోట్ల మంది ఆయుష్మాన్‌భారత్ పథకం కింద రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందించేందుకు కేంద్రం హెల్త్‌కార్డులు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమానికి బీజేపి శ్రేణులు, హిందు బందువులు, అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు అమరేందర్‌రెడ్డి, సబ్బిరెడ్డి వెంకట్‌రెడ్డి, బి. కృష్ణ, నారాయణ, రామన్నగారి వెంకటేశ్వర్‌రెడ్డి, పరుశురాం, మోహన్‌యాదవ్, నాగభూషణం, శ్రీనివాస్‌గౌడ్,కుమారస్వామి, కిరణ్, ప్రసాద్, మురార్జి తదితరులు పాల్గోన్నారు.