మహబూబ్‌నగర్

పోలీసుల పట్ల ప్రజల్లో నమ్మకం కలగాలి: ఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్,జూలై 16: పోలీసుల పట్ల ప్రజల్లో నమ్మకం కలిగేవిధంగా నిరంతరం కృషిచేయాలని జిల్లా ఎస్పీ అనురాధ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో శాంతిభద్రతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అనురాధ మాట్లాడుతూ పోలీసుశాఖకు అనుబంధంగా ఉంటూ సామాజిక చైతన్యాన్ని కోరుకునే స్వచ్చంధ సంస్ధలు, వ్యక్తుల ద్వారా ప్రశాంత వాతావరణ నిర్మాణానికి నిరంతరం కృషిచేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఇటివలీ కాలంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవడంలో ప్రజలు ఉత్సహం చూపడం అభినందనీయమన్నారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు పట్ల ప్రజలు భాగస్వాములు కావాలని మన రక్షణ మన చేతుల్లోనే ఉంటుందన్న అవగాహన కలిగించాలన్నారు. ముఖ్యంగా బంగారు గొలుసులు దొంగతనాలు పూర్తిగా తగ్గిపోవడం మనం చూస్తున్నామని నిఘా కెమెరాల సహయంతో పోలీసుశాఖ పర్యవేక్షణ ఎంతో విస్తృతంగా చేస్తుందని వివరించారు. అనంతరం పోలీసు అధికారులు వివిధ నేరాల్లో ఇటివల జరిగిన పరిశోధనలో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డిఎస్పీ భాస్కర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పెండింగ్‌లో ఉన్న చెక్కులు, పాసుపుస్తకాలు అందజేయాలి
* జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్
ధన్వాడ, జూలై 16: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం క్రింద మంజూరు చేసిన చెక్కలు,్భపాసుపుస్తకాలను పెండింగ్‌లో ఉన్నవాటిని తక్షణమే సరిచేసి రైతులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో విడియోకాన్ఫిరేన్స్‌లో ధన్వాడ,మరికల్ మండలల తహశీల్దార్‌లకు కలెక్టర్ అదేశించారు. రైతు బంధు పథకంలో చెక్కుల,్భపాసుప్తుకాల పంపిణిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరింస్తే అట్టివారిపై చర్యలు తీసుకోవాడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ప్రతి రోజు చెక్కులు,్భపాసుపుస్తకాల పంపిణిపై విడియోకాన్ఫిరేన్స్‌ద్వారా తెలియజేయాలని కలెక్టర్ తహశీల్దార్‌లను అదేశించారు. ఈవిడియోకాన్ఫిరేన్స్‌లో ధన్వాడ మండల తహశీల్దార్ రవీంధర్‌రావు,్ధన్వాడ మండల ఆర్ ఐ.మధుసుధన్,్ధన్వాడ మండల ఎంపిడి ఓ శశికళ తదితరులు పాల్గొన్నారు.