మహబూబ్‌నగర్

మొక్కలు నాటి వాతావరణ సమతుల్యాన్ని కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, జూలై 16: విరివిగా మొక్కలు నాటి వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకుందామని వనపర్తి జిల్లా కలెక్టర్ శే్వతామహంతి అన్నారు. సోమవారం వనపర్తి మండలం చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో కలెక్టర్ మొక్కలు నాటి విద్యార్థులకు ప్రోత్సహాన్ని అందించారు. ప్రాణ వాయువును ఇచ్చే మొక్కలను నాటి పెంచడం వల్ల భావితరాలకు ప్రాణం పోషేవారమవుతామని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో అందరు పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఎంపిపి శంకర్‌నాయక్ మాట్లాడుతూ చిట్యాల ఉన్నత పాఠశాలకు ఎంతో మంచి పేరుందని అలాంటి పాఠశాలలో హరితహారం నిర్వహించడం సంతోషమన్నారు. మొక్కలు నాటడం వల్ల నీడతో పాటు వర్షానిస్తాయని ఆయన చెప్పారు. డి ఈవో సుశీందర్‌రావు, జిల్లా ఆటవి శాఖ అధికారి బాబ్జిరావు తదితరులు కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వెంకటయ్యయాదవ్, డి ఆర్‌డివో గణేష్, డిపి ఆర్వో వెంకటేశ్వర్లు, సర్పంచు విష్ణువర్దన్‌రావు, వైస్ ఎంపిపి సురేష్‌గౌడ్,పి ఏ సి ఎస్ అద్యక్షులు సతీష్, పాఠశాల ప్రదానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 92 మొక్కలను నాటారు.
స్వచ్ఛ భారత్‌పై అన్ని గ్రామాల్లో సర్వే
వనపర్తి, జూలై 16: స్వచ్చ్భారత్ మిషన్‌లో భాగంగా ఆగస్టు నెలలో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్ పేరుతో దేశంలోని అన్ని గ్రామాలలో సర్వే నిర్వహించనున్నట్లు కేంద్ర తాగునీరు, పారిశుద్ద్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరి అరుణ్ బరోక తెలిపారు. సోమవారం ఆయన స్వచ్చ మిషన్ పురోగతి విఫయంలో తమిళనాడు, తెలంగాణ , త్రిపూర, ఉత్తర ప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన గ్రామీణ అభివృద్ది శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లాల కలెక్టర్లతో న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వచ్చ్భారత్ మిషన్ కింద ఇప్పటి వరకు చేపట్టిన పారిశుద్ద్య కార్యక్రమాలపై ఆగస్టులో స్వాతంత్ర సంస్థ ద్వారా సర్వేలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సర్వే ద్వారా స్వచ్చ్భారత్ మిషన్‌లో భాగంగా ఇప్పటి వరకు చేపట్టిన పనుల నాణ్యత, పరిమాణాలను లెక్కించడం జరుగుతుందన్నారు. దీని ఆదారంగా ఆయా జిల్లాలకు ర్యాంకింగ్‌లు ఇస్తామని తెలిపారు. దీని ద్వారా గ్రామాలలో పారిశుద్ద్య పనులు,పరిశుభ్రత కార్యక్రమాలను పెంపోందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సర్వేలో భాగంగా దేశంలోని 698 జిల్లాలో 6980 గ్రామాలను, పాఠశాలలను, అంగన్‌వాడి తదితర 34వేల ప్రజా సంస్థలను సందర్శించి సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన స్వచ్చ్భారత్ మిషన్ పనులు, నివేదిక, ప్రజాభిప్రాయాలను సేకరించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శే్వతామహంతి, డిఆర్‌డివో గణేష్, స్వచ్చ్భారత్ మిషన్ ప్రేరక్ భరత్,డిపివో వీరబుచ్చయ్య పాల్గొన్నారు.