మహబూబ్‌నగర్

ముస్లీంలు ఆర్థిక, సామాజికంగా ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూలై 16: భారతదేశంలో అన్ని వర్గాలతో సమానంగా ముస్లీంలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలన్నదే ఎంఐఎం పార్టీ ప్రధాన ఉద్దేశమని ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మున్నాబాష అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 60 ఏళ్లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ముస్లీంలకు ఎలాంటి సహాయం చేయలేదని మండిపడ్డారు. కేవలం ముస్లీంల ఓటు బ్యాంకు రాజకీయాలకు పూనుకుందని మండిపడ్డారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ముస్లీం మైనార్టీలను దోషులుగా చూస్తున్నారని, ఇలాంటిపరిస్థితులను ఎదుర్కొనేందుకు ముస్లీం మైనార్టీలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ ముస్లీంల పార్టీ అని చెబుకునేందుకు సిగ్గుపడాలన్నారు. సెక్యులర్ దేశంగా ఉన్న భారతదేశంలో ముస్లీం మైనార్టీలకు తగిన ప్రాధాన్యత ఎక్కడిదని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా ఎంఐఎంను వాడుకున్న కాంగ్రెస్ పార్టీ వారి తప్పిదాలతో పరాజయం పొందిన తర్వాత తమపై నెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ గోమాత రక్షణ పేరిట ముస్లీంలను చంపడం దారుణమని, హిందువుల చేతనే ఆవులను చంపించి ముస్లీంలపై నెడుతున్నారని ఆరోపించారు. రాజకీయంగా ముస్లీంలు చైతన్యం చెందాలని, తమకు అనుకూలమైన వారిని అన్ని విధాలుగా సహకరించేవారికి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. 65 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల కంటే భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లీం మైనార్టీల సంక్షేమానికి పాటుపడుతుందని కితాబిచ్చారు. గురుకుల పాఠశాలలు, షాదీముబారక్, రిజర్వేషన్ల పరంగా సహకరిస్తుందని ప్రశంసించారు. ముస్లీం మనోభావాలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న త్రిబుల్ తలాక్ తదితర అంశాలపై కాంగ్రెస్ వౌనం వహించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రెండు కోట్ల ఉద్యోగాలు ముస్లీంలకు ఇస్తానని వాగ్దానం చేసిన మోడీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బహిరంగ పర్చాలని, ఇక్కడి వారికి ఏమైన ఉద్యోగాలు వచ్చాయా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుండి అన్ని ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ముస్లీం మైనార్టీలు, ఎంఐఎం కార్యకర్తలు తరలివచ్చారు.